Sunday, November 13, 2011

స్నేహం vs ప్రేమ

                                        అతి కొద్ది మంది కి మాత్రమే ఇది అర్ధం అవుతుంది ఈ రెండింటికి భేదము.. మనం చిన్నప్పుడు చదువుకునే పాటశాల నుండి చాల మంది ని కలుసుకుంటాము.. అందులో మనతో మాట్లాడి మనతో స్నేహం చేసే వాళ్ళు చాలా తక్కువ.. ఆ తక్కువ మంది లో కూడా మన మనసు కి చేరువగా స్నేహం చేసేవాళ్ళు ఇంకా తక్కువ గా ఉంటారు.. అలాగే మన కి మన స్నేహితులలో నచ్చే విషయాలు కూడా తక్కువ గా ఉంటాయి.. సో బెస్ట్ ఫ్రెండ్స్ మహా ఐతే ఒక ఇద్దరో ముగ్గురో ఉంటారు 10 వ తరగతి చదువుకునే రోజుల వరకు అసలు అప్పటి వరకు ప్రేమ అనే మాటకు అర్ధమే తెలీదు .. కాకపోతే మనతో పాటుగా ఇంటర్ చదువు కోసం వచ్చే ఇద్దరో ముగ్గురో దొరకవచ్చు  అంటే మనసుకు నచ్చిన స్నేహితులుగా.. ఈ స్నేహితులు మన ఇంటి పరిసరాల వరకే పరిమితం..
                           అలా అక్కడ కూడా కొత్త స్నేహితులు ఇతర ప్రదేశాల నుండి అంటే మన సిటీ/టౌన్ నుండి వచ్చిన వాళ్ళు పరిచయం అవుతారు.. అందులో మన మనసు కొంత మందిని మాత్రమే ఎంచుకుంటుంది..ముఖ్యంగా మన ఇష్ట అఇస్టాలు గౌరవించి  లేదా మన వాటి తో మ్యాచ్ ఐయ్యే వాళ్ళే  మన కు స్నేహితులు గా దొరుకుతారు.. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మన మనసు ఎప్పుడు స్నేహం చెయ్యాలని అనుకోదు..ఇక ఈ వయసు లో ప్రేమ గురించి కొంచెం కొంచెం మనసుకి తెలుస్తూ ఉంటుంది కాని స్నేహానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాము.. కాని ఎప్పుడు ప్రేమ గురించి తెల్సుకోవాలనే కుతూహలం ఉంటుంది.. అలా ఎవరైతే ఈ రెండిటి మధ్యలో కొట్టు మిట్టాడక చదువు మీద శ్రద్ధ పెడతారో వారికో గమ్యం ఏర్పడుతుంది.. అంటే ఆ రెండు సంవత్సరముల తరువాత ఏమి చెయ్యాలి అనే లక్ష్యం.. కాని మరో ఇద్దరు లేదా నలుగురు తోడు అవుతారు ఇంకా పై చదువులకి వెళ్ళే వాళ్ళు ఐతే..
             ఇక ఆ పై చదువుల్లో మరి కొంత మంది దేశం మూలల నుండి వచ్చిన కొత్త మనుషుల్లో మనకి స్నేహితులు అవుతారు.. అయితే ఇక్కడ స్నేహానికి కన్నా ప్రేమ కి విలువ ఇచ్చే ప్రయత్నం ఎక్కువ.. మరి అది సినిమా ల ప్రభావమో లేక మన చుట్టూ తిరిగే స్నేహితుల పుణ్యమో తెలియదు కాని మన శ్రద చదువు స్నేహం కన్నా ఒక తోడు ని వెతుక్కునే పని ఎక్కువగా ఉంటుంది.. అది కొంత మంది కి టైం పాస్ కొంత మంది కి ప్రెస్టేజ్.. ఏదో ఒకటి అనుకోండి ఇక్కడ.. ఇందులో కూడా నిజమైన ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు...కాని స్నేహం మాత్రం ఖచ్చితంగా నిజాయితీ గా ఉంటుంది.. ఇక్కడ ఈ వయసు లో పరిచయం ఐన వాళ్ళు మనకు వివాహం ఐన తరువాత కూడా మనతో స్నేహాన్ని కొనసాగిస్తుంటారు..     
                                ఇలాంటి సమయం లో ప్రేమించామా లేదా అనే అని ఆలోచించే వాళ్ళే కాని ఆ ప్రేమ ఎంత వరకు పెళ్లి వరకు కొనసాగుతుందో అని ఆలోచించే వాళ్ళు తక్కువ.. ఎందుకంటే ఆ వయసు లో వాళ్ళకి రాబోయే కాలానికి ఏమి కావాలో (అంటే ఇంకా వాళ్ళ కాళ్ళు మీద వాళ్ళు నిలబడలేదు కనుక ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కనుక) తెలియదు..ఇక్కడ కూడా తన ప్రేమ ని ఎలా ఐన దక్కించుకోవాలి అనుకునే వాళ్ళే ఎక్కువ ఈ మధ్య కాలం లో.. ఎదుటి మనిషి మనసు లో ఏమి ఉంది అనేది వాళ్ళకి అనవసరం.. అలా అని అందరు ఇలాగే ఉంటారు అనుకోలేం.. కొంత మంది నిజంగా మనస్పూర్తిగా ఇష్టపడి ప్రేమిస్తున్నాం అని చెప్పినా దాన్ని అలుసుగా తీసుకుని టైం పాస్ చేసేవాళ్ళు ఉంటారు.. అలా ఎప్పుడైనా ఆ వ్యక్తి కి వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలిస్తే ప్రేమ మీద నమ్మకం పోయి వాళ్ళని చంపే దశకి కూడా వచ్చేస్తారు.. అది వాళ్ళ తప్పు కాదు ఆవేశం అలా చేస్తుంది.. సరే మరి నిజమైన స్నేహం ఏంటి?? మరి నిజమైన ప్రేమ ఏంటి అని మీరు అడగవచ్చు!!!
                            నా ఉద్దేశం లో నిజమైన ప్రేమ అంటే పెళ్లి కి ముందు ఉన్న ప్రేమ పెళ్లి ఐన తరువాత కూడా ఉండాలి.. ఆ మనిషి దగ్గర ఉన్నా లేకున్నా తనలో ఉండే ప్రేమ లో మాత్రం మార్పు ఉండకూడదు..ప్రక్టికాల్ గా చెప్పాలంటే స్నేహం ప్రేమ గా మారొచ్చు కాని ప్రేమ స్నేహంగా మారలేదు.. ఒక మనిషిని అప్పటిదాకా ప్రేమికురాలు/ప్రేమికుడు గా ఊహించుకుని ఒకేసారి స్నేహితుడు/స్నేహితురాలు అని అనుకోడం సాధ్యం కాదు.. నిజమైన స్నేహం ఎప్పుడు స్నేహితుడు దగ్గర నుండి సయం ఆశించకుండా తను ప్రతి సమయం లోను నేను ఉన్నానని తోడు గా నిలుస్తుంది...
                         అనగా మనం ఏ సహాయం చేసినా తిరిగి ఆ సహాయం అదే స్నేహితుడి నుండి తిరిగి ఆశించకుండా చెయ్యాలి కాని నేను ఎన్ని చేసినా స్నేహితుడు ఎందుకు అర్ధం చేసుకుని తిరిగి చెయ్యటం లేదు అని అనుకూడదు.. నిజంగా మనం ఒకరికి సహాయం చేస్తే వారే అక్కర్లేదు వేరే ఏదో ఒక రూపం లో మనకు సహాయం దేవుడు అందిస్తాడని నా ఫీలింగ్..
పైన చెప్పిన వివరాలు మన చుట్టూ నిత్యం జరుగుతున్న సంగటనలు మాత్రమే  ..... ఏ ఒకరిని ఉద్దేశించి మాత్రం కాదు..     
 

8 comments:

  1. బాగుంది.. sensitive point..

    I loved the last paragraph..

    "స్నేహం ప్రేమ గా మారొచ్చు కాని ప్రేమ స్నేహంగా మారలేదు"...

    ఎందుకు మారదు?? if it is love.. .

    ReplyDelete
  2. చాలా జటిలమైన విషయం. కానీ ఒక కోణంలో పరిశీలించొచ్చు. "ఒరేయ్‌" లేదా "ఒసేయ్‌" అని పిలిచే - పిలిపించుకునేటంతటి స్వాతంత్ర్యం ఉన్న స్నేహితులు దొరకడం మన వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గుతూ పోతుంది. చిన్ననాడు పరిచయస్తుల్ని కూడా స్నేహితులుగా భావించిన మనం, పెరుగుతున్న కొద్దీ అవతల వ్యక్తిని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించిగానీ స్నేహితుడు/స్నేహితురాలి హోదా కల్పించము. తగిలిన దెబ్బలనుకోండి లేదా అనుభవాలనుకోండి. కోలమానం మారుతూ పోతుంది. ఆ X-Factor ఎంటో కానీ, అతి కొన్ని సంధర్భాల్లో అది ప్రేమ అనిపిస్తుంది. అంతా కుదిరితే ఓ ప్రేమ కథ మొదలు.

    కానీ వయసుతోబాటు సగటు వ్యక్తికి ప్రేమ అంటే కూడా అవగాహన మారుతూ పోతుంది. ప్రేమలో ఉన్న జంట లేదా ఇప్పుడే పెళ్ళైన జంటసైతం ప్రపంచంలో "మమ్మల్ని మించిన ప్రేమికులుంటారా" అని మొదలు పెట్టి "అబ్బా ఎలాంటి వ్యక్తి బారిన పడ్డానురా" అనే అథః పాతాళాణ్ణి చవిచూసిన తరువాత మెల్లిగా ప్రేమ అంటే ఎంటో అవగతం చేసుకోవడం మొదలెడతారు. ఇక ఒక నలుసుపుట్టాక మొదట కాస్తంత ఇబ్బంది పడ్డా, అసలు నిజమైన ప్రేమ అంటే మొదటిసారిగా "ప్రేమకు పునాది ఫలాపేక్షలేని త్యాగం" అని తెలుసుకుంటారు. ఆ తరువాత వారిద్దరి మధ్యనున్న భార్యా-భర్తల సంబంధం కూడా కొత్త ఉరవడులు తొక్కుతుంది. ప్రేమంటే పూర్తి అవగాహనలేని దుందుడుకు వయసులో యవ్వనం ఆకర్షణగా పనిచేసి, ఆ యవ్వనం తరిగేకొద్ది వారిద్దరు ఒకరిపై ఒకరికి కలిగిన నిజమైన ప్రేమ పుణ్యమా అని కలిసుంటారు.

    ఏవో నాకు తోచిన రెండు ముక్కలు...

    ReplyDelete
  3. తెలుగు భావాలు : చాల బాగా చెప్పారండీ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నిజ జీవితం లో చూస్తున్నవే.. ఏ మనస్తత్వ నిపుల్ని అడిగే ప్రశ్నలు జవాబులు చూసిన ఇలాంటి సమాధానాలే కనిపిస్తున్నాయి.. మీరు పేర్కొన్న ప్రతీ పాయింట్ తో నేను ఏకీభవిస్తున్నాను.. ధన్యవాదములు.. దయ చేసి మరో కామెంట్ కి మీ సమాధానం చెప్పగలరా? " ప్రేమ స్నేహంగా మారదు" అని నా ఉద్దేశ్యము..కాని మరొక రీడర్ దీనికి అంగీకరించటం లేదు దీని పై మీ వ్యాఖ్య?

    ReplyDelete
  4. స్నేహం, ప్రేమల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువే. అభిమానించే స్నేహితులు నలుగురైనా ఉంటారు. ప్రేమించే నేస్తం మాత్రం ఒక్కటే జీవితంలో. స్నేహం ప్రేమగా మారటం సహజం. ప్రేమ స్నేహంగా మారాటం అసాధ్యం.
    మీరు చెప్పిన తీరు బాగుంది.

    ReplyDelete
  5. చిన్ని బుడతడి దగ్గిరనుంచి యుక్త వయస్సువారి వరకు కొన్ని తప్పు అవగాహనలున్నాయి.

    పరిచయం = స్నేహం
    కామం = ప్రేమ

    పరిచయం నుండి స్నేహం పుడుతుంది. ఆ స్నేహం నిజమైన ప్రేమకు కొన్నిసార్లు దారితీయగలదు. పరిస్థితులు అనుకూలించకపోతే, అదే ప్రేమ తిరిగి స్నేహంగా కూడా మారవచ్చు. కానీ, పరిచయంనుండో లేదా స్నేహంవల్లో కామం కలిగితే, అనుకూలించకపోతే ఆ భావన తిరిగి పరిచయంలా కూడా మిగలదు. ఇది నా అవగాహన.

    ReplyDelete
  6. "పరిచయం నుండి స్నేహం పుడుతుంది. ఆ స్నేహం నిజమైన ప్రేమకు కొన్నిసార్లు దారితీయగలదు. పరిస్థితులు అనుకూలించకపోతే, అదే ప్రేమ తిరిగి స్నేహంగా కూడా మారవచ్చు."

    Well said sir... Agree 100%

    ReplyDelete
  7. baagaa vraasaaru, kaani prema kuda snehanga migilipotunna rojulu ivi.

    ReplyDelete