Wednesday, April 4, 2012

మరో హ్యాపీ డేస్ తో ప్రేమ కథ --Episode 7

లహరిక వాళ్ళ నాన్న గారికి బాగోలేదు అని వార్త తెలియగానే హటాత్తుగా ఇండియా కి తిరుగు ప్రయాణం అవుతుంది.. కొద్ది రోజులకు అతనికి కొన్ని అనారోగ్య  కారణాల వల్ల చనిపోవాల్సి వస్తుంది ..జీవితం లో  అన్ని సుఖాలే ఉండవు కదా సుఖ దుక్ఖం కల్సి వస్తు పోతు ఉంటాయి కాని ఏది శాశ్వతం గ నిలిచిపోదు ..ఒకరోజు  లహరిక  షాపింగ్  కోసం  బైటకు  వెళుతుంది .. అక్కడ  ఒక  దృశ్యం  కనపడుతుంది ..గుంపులు  గుంపులుగా  జనాలు  గుమిగూడుతూ  ఉంటారు .. ఏమి  జరిగిందో  అర్ధం  కాక  తను  ఏమైందో  తెల్సుకుందాం  అనే  దిశగా  అక్కడకు  వెళుతుంది .. చూస్తూ  ఉండగానే  అక్కడ  ఒక  మనిషి  కారు  ప్రమాదం వల్ల ప్రాణ సంకటం లో ఉన్నట్లు గుర్తిస్తుంది . ఎవరో పాపం అనుకుని అక్కడ నుండి వెనుతిరిగి పోతూ ఉండగా .. అప్పుడు ఆ పది ఉన్న వ్యక్తి ఎవరో కాదు తన దగ్గర బంధువుల అబ్బాయి  కిరణ్ అని తెలుస్తుంది . వెంటనే  ఒక్క నిమిషం వేస్ట్ చెయ్యకుండా అతన్ని హోప్సితల్ కి చేర్చే ప్రయత్నం లో ఉండిపోయింది . సరి ఐన సమయం లో హాస్పిటల్ కి తీసుకోచినందు వల్ల అతనికి ప్రాణ సంకటం తప్పుతుంది .ఎలాగోలా అతను కొద్ది రోజుల్లో తేరుకుని లహరికకు థాంక్స్ చెప్పుకుందామని తన కోసం ఒకరోజు వల్లినిత్కి వెళ్లి  ఎదురు చూస్తూ ఉంటాడు..
లహరిక అమ్మ తో ఇలా చెప్పా సాగాడు.. " నా ప్రాణాల్ని కాపాడినందుకు నేను లహరిక కు ఎంతో రుణ పది ఉంటాను. ఆ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా అడుగుతున్నాను.. నన్ను దయచేసి అపార్ధం చేసుకోరని భావిస్తూ, మీరు ఒప్పుకుంటే లహరిక ను పెళ్లి చేసుకుందామని ఆస పడుతున్నాను". లహరిక ఒక్కసారిగా నివ్వెర పోయింది..అతని మాటకు ఏమి చెప్పాలో ఒక్క క్షణం పిడుగు పడ్డ దానిల మారిపోయింది..
మనసులో "ఏమి మాట్లాడుతున్నావ్ నువ్వు, సతి మనిషిగా నీకు సహాయం చేస్తే నన్ను పెళ్ళాడే ఆలోచన ఎలా తేచేసుకున్నావ్ అప్పుడే " అని లాగి లెంప కయ తీద్దాం అని అనిపించింది.. కాని అది బైట పడకుండా..తన ఆలోచనల్లో పడిపోయింది..
" నాన్న గరఉ చనిపోయి ఎంతో కలం కాలేదు.. ఇప్పుడు నా ప్రేమ వ్యవహారం బైటకు చెప్పి అమ్మ ను మరింత ఇబ్బందుల్లో పదేయ్యలేను.." అని అనుకుని చప్పున లేచి.. కిరణ్ తో ఇలా అంది.. చూడు కిరణ్ నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు.. కాని నాన్న గారు చనిపోయి ఎంతో కాలం కాలేదు.. ఇంతలో ఇలాంటి పెళ్లి అని ఆలోచనలు కూడా నాకు ఇబ్బంది గా అనిపిస్తుంది.. "
లహరిక అమ్మ మాత్రం తన కూతురు లహరిక పెళ్లి చేసుకుని   హాయిగా ఉండాలని కోరుకుంటూ ఉంది.. కాని లహరిక ను బాధ పెట్టి తన మనసుకి విరుద్ధంగా వెళ్లకూడదని ఇలా అంది.." చూడు కిరణ్, ఇంట హటాత్తు గా నువ్విల చెప్పేసరికి పాపం లహరిక కూడా ఏమి తేల్చుకోలేకుండా ఉంది.. అల అని నిన్ను వదులుకోవాలని నేను అనుకోవటం లేదు.. కాని తనకు కొంత సమయం ఇవ్వు.. ఏ విషయం చెప్తుంది"
లహరిక మరి ఒక్క కక్షణం ఆలోచించకుండా.అక్కడ నుండి వెళిపోయింది.. కిరణ్ కి కూడా ఏమి అనాలో అర్ధం కాకా తను వెళిపోయాడు..
సరిగ్గా అదే సమయం లో రోహన్ అతని తల్లిదండ్రులకు లహరిక తన ప్రేమ విషయం చెప్పి " నేను ఆ అమ్మాయి ని గాడంగా ప్రేమించాను.. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకుని మీరు కూడా నా కోరిక కాదనే దృడ నిశ్చయం తో ఉన్నాను" అని అనగా " నీకెంత ప్రేమ ఉంటె మాత్రం ఆ అమ్మాయి కోసము పెళ్ళికి ముందే మాతో ఇంట అగురవంగా మాట్లాడుతున్నావే రేపు పెళ్లి ఐయ్యక అసలు మమల్ని పట్టించుకున్తవన్న నమ్మకం ఏంటి.. ఐన మన స్టేటస్ ఏంటి ఆ పిల్ల స్టేటస్ ఏంటి.. " అని అంటూ మాట మాట పెరిగేట్టుగా ఇరువురు వాదించుకున్నారు..
                                      రోహన్ వారితో " మీరు మీ పాత సిద్ధాంతాలు మారారు.. ఐన మల్లి చెబుతున్నాను.. మీకు నచిన నచాకపోయిన నేను ఆ అమ్మాయి నే పెళ్లి చేసుకుంటున్న.. నేను కావాలి అనుకుంటే నా పెళ్లి కి రండి మమ్మల్ని ఆశీర్వదించండి.. లేకుంటే మీకు ఒక కొడుకు ఉన్నదన్న విషయం మర్చిపోండి" అని చెప్పి వేగంగా బైటకి తన బైక్ మీద వెళిపోయాడు.. మనిషి ఆలోచనల్లో/ ఆవేశం lo ఉన్నప్పుడు.. మనసు సరిగ్గా లేదు అనిపించినప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే అవి ఎప్పుడు సరి కావు.. అతను చేస్తుంది ఇప్పుడు అదే.. ఆ ఆవేశం తో తన బైక్ నడుపుతూ ఉన్నది ఒక రోడ్ అని గ్రహించక తన ఆలోచనల్లో తాను ఉన్నాడు.. ఈలోగా ఒక లోర్రి ఎదురు గా వేగంగా దూసుకోచింది.. క్షణం లో రోహన్ కి చావు కనిపిన్చినట్లైంది.." ఐపోయింది.. నా జీవితం ఇక్కడితో ముగియబోతోంది.. తల్లిదండ్రులని బాధ పెట్టినందుకో ఏమూ.. వాళ్ళ కోపాగ్ని నాకు తగిలినట్లుగా ఉంది" అని అనుకుంటూ ఉండగానే .. తన బైక్ గాల్లో తేలి దివిదర్ ని గుడ్డి తను రోడ్ మీద కుప్పల కూలిపోసగాడు.. రక్తం యేరు ల ప్రవహించసాగింది.. వెను వెంట నే జనం గుమి గూడటం.. అమ్బులన్సు రావటం హాస్పిటల్ లో చేరటం జరిగిపోయాయి.. రోహన్ తల్లి అతన్ని అలా ఆ పరిస్తుతుల్లో బెడ్ మీద చూసేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది.. డాక్టర్ తన పని తను చేస్తూ పోయాడు.. ౨౪ గంటలు తరువాత కాని ఎం చెప్పలేము అని చెప్పాడు..
ఆ తల్లి కొడుకు కోసం అల్లది పోతు దైవ ప్రార్ధన సాగిస్తూ ఉంది.. తండ్రికి ఎం పాలు పోడం లేదు..  ఆఖరికి దేవుడు కరునిచినట్లుగా డాక్టర్ చెప్పస్గాడు.." భయపడడానికి ఇప్పుడెం లేదు.. కాని ఐ అం సారీ.. మీ కొడుకుని ఐతే కాపదగాలిగము కాని అతను ఇప్పుడు మిమల్ని ఎవరిని గుర్తించలేదు.. అతను ఇప్పుడు కోమా లోకి వెళిపోయాడు.. ఏ పరిస్థితుల్లో అతను మామూలు ఆతదో కూడా ఇప్పుడప్పుడే చెప్పలేము.."
ఆ మాటకు సంతోషించాలో ఏడవాలో వరిరివురికి అర్ధం కాలేదు..ఏమి చేయలేని పరిస్థితుల్లో అక్కడే చతికల పడిపోయారు..
                       మరి వేపు లహరిక రోహన్ ని కల్సుకుని తన విషయం మాట్లాడటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది.. తన కాంటాక్ట్ నెంబర్ ప్రకారం ఎంత ప్రయత్నించిన లాభం లేకపోయింది.. రోహన్ తనను మోసం చేసాడేమో అని అప్రయత్నంగా తనకి నమ్మకం సన్నగిల్లుతూ ఉంది అంట లోనే తటపటాయిస్తూ " నా రోహన్ నన్ను మోసం చెయ్యలేడు.. ఒక వేల ఏమైనా చిక్కుల్లో పడి ఉన్నదేమో అని రోదిస్తూ రాసాగింది.." అనుకోకుండా ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్లి నెరిగ సమస్య పరిష్కరించుకుందాం అని నిర్ణయించుకుంది..
"టింగ్ టింగ్.. కాలింగ్ బెల్ మోగుతు ఉంది.." ఏమి స్పందన లేదు.. మళ్లీ ప్రయత్నించింది.. కొంత సేపటికి ఇంటిలో నుండి ఒక మధ్య వయసు స్త్రీ ఒకావిడ వచ్చి "ఎవరు కావాలమ్మ నీకు.." అని అడిగింది.. " ఇది రోహన్ ఇల్లెనండి"..
అవునన్నట్లు తలూపింది.." నా పేరు లహరిక.." అని చెప్పిన క్షనానికే.. " రాక్షసి నువ్వేనా లహరిక అంటే.. మావాడి జీవితం నాశనం చేయడానికి వాడి జీవితం లో కి ప్రవేసించావ్.. ఇంకా ఎం పట్టుకుపోదామని ఇక్కడకి దాపురించావ్..చేసిన నిర్వాకం చాలు ముందు గడప దిగు!!!!" అని గొంతు హెచిన్చింది..అసలేం జరుగుతుందో ఒక్క క్షణం తన కి అర్ధం కాలేదు.. ఆవిడ కోపం ముందు లహరిక ఎం మాట్లాడిన కొట్టే విధంగా ఉంది ఆవిడ ధోరణి.. ఇంకా ఏదో చెప్పబోయిన లహరికకు సమాధానంగా "ముందు మావాడి జీవితం లో నుండి శాస్వతంగా దయచేసి వెళిపో" అని అరవసాగింది.. ఇంకేం మాట్లాడలేక అక్కడ నుండి తిరుగు ప్రయాణం ఐంది.. అనుకోకుండా ఒకరోజు రోహన్ స్నేహితుడు ఆమెకి కలిసాడు.. ఎంక్వయిరీ కోసం అన్నట్లుగా " అసలు రోహన్ ఏమైయ్యాడు.. ఎందుకు వాళ్ళ అమ్మగారు నన్ను అన్నాన్ని మాటలు అన్నారు.. అసలేమైంది" అని అడిగింది..
"రోహన్ కి మరొకరితో వాళ్ళ బంధువుల అమ్మాయి తో పెళ్లి ఐపోయింది.. వాళ్ళ అమ్మ నాన్న కి ఇచిన మాట కోసం తను ఆ అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు.. నువ్వు ఇక నుండి నీ దరి చూసుకోవటం మంచిది.. రోహన్ అమ్మ కు నువ్వు మళ్లీ లైఫ్ లో కలిస్తే వాళ్ళ కాపురాని కి ఏమైనా ఇబ్బంది కలవగా వచ్చునని నీతో అలా మాట్లాడింది..దయచేసి ఇక్కడ నుండి ఈ విషయం వదిలేసెయ్" అని చెప్పి వెళిపోయాడు.. అలా రోహన్ స్నేహితుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే రోహన్ తల్లి అతని తో అలా చెప్పమని ఒట్టు వేయిన్చుకుంటుంది.. పాపం ఈ విషయం తెలియక పిడుగు పడినట్లుగా మారు మాట్లాడకుండా తన ఇంటికి చేరుకుంటుంది.. కన్నా కళలు అన్ని ఒకేసారి నీరు కారిపోయినట్లు.. ఏడుపు గుట్టలుగా తన్నుకొస్తుంది.. ఎవరికీ చెప్పుకోలేక తనలో తనే మదన పడుతూ వస్తుంది.." నేను మోసపోయాను.. అక్షరాల మోసపోయాను.. రోహన్ నువ్వు నన్ను ఇలా నడి రోడ్ మీద వదిలేసి ఇంకో ఆడదాన్ని ఎలా పెల్లడవు.. నువ్వు చేసిన వాగ్దానాలన్నీ మోసం.. " అని ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది వరండాలో.. అంత లో లహరిక తల్లి, కిరణ్ తో రావటం కనిపిస్తుంది.. లహరిక తమాయించుకుని.." ఏమిటి కిరణ్ ee టైం లో ఇలా నీ రాక?" అని అడగగా... " లహరిక తల్లి " అమ్మా లహరిక "నీకు పెళ్లి వయసు వచ్చింది,మీ నాన్న గారు బ్రతికి ఉంది ఉంటె ఈ పాటికి నీ పెళ్లి ఘనంగా చేసి ఉండేవారు.. అయన లేకున్నా కూడా ఆ లోటు నీకు రానివ్వను.. కిరణ్ నీకు సరి ఐన వరుడు అనిపిస్తుంది.. నీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాడు..నీ మనసులో కోరిక ఏమిటి తల్లి?? " అని అడిగింది.. లహరిక వెంటనే రోహన్ మీద ఉన్న కోపం/ఆవేశం లో " నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అమ్మ.." అని చెప్పి అక్కడ నుండి వెనుదిరిగింది..ఇంకా కిరణ్ ఆనందానికి హద్దులు లేవు.." లహరిక నా జీవిత భాగస్వామి అవుతుందని ఎనేన్నాడు ఊహించలేదు అత్తయ్య!!!.. చాల చాల ఆనందంగా ఉంది ఇవాళ నాకు" అని  " మా అమ్మ నాన్న తో కూడా ఈ శుభ వార్త చెప్పుకొస్తాను" అని తన ఇంటికి కదిలిపోయాడు..
లహరిక మాత్రం ఆలోచనల్లో తేలుతూ ఉంది.." ఒక వేల రోహన్ ఏదైనా ప్రాబ్లం లో ఉన్నడేమూ.. నాతో అతని స్నేహితుడు అబద్దం చేబుతున్నదేమూ .." అని ఆలోచిస్తూ.. "వాళ్ళు అబద్దం చెప్పాల్సిన అవసరం ఎం ఉంది.. రోహన్ నన్ను మోసం చేయదలిచే ఇన్నట్లు నాతో ప్రేమ నాతం ఆడాడు.. అందుకే ఇన్నాళ్ళు కూడా నాతో ఒక్కసారి కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యలేడు. తల్లి తండ్రి మాట కాదనలేక తన జీవితం తాను చూసుకున్నాడు.. ఇంకా అతనేం ఐపోతే నాకేం" అని..  ఇంకా జీవితం లో అతన్ని కల్సుకోకూడదు అని నిర్ణయించుకుంది.. "ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రోఅహన్ ఏ నా పక్కన లేనప్పుడు. నా తల్లి ని మాత్రం నేనెందుకు బాధ పెట్టాలి.. నిండా మునిగిన వాళ్ళకి చలి ఏమిటి.. ఒక మగవాడి చేతిలో ఓడిపోయనే ..అదే ఎక్కువగా నన్ను బాధిస్తు ఉంది..లోకం లో నిజమైన ప్రేమ అనేది లేదు.. అంతా ఒక బూటకం.. కాని వదేప్పుడైన కనిపిస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే ఇంకే ఆడ పిల్ల వాడి చేతిలో మోసపోకుండా ఉంటుంది.." అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది..
       చూస్తుండగానే రోజులు దొర్లిపోయాయి.. లహరిక మరొకరి వశం ఐపోయింది..  అయిష్టంగానే కిరణ్ కి భార్యామణి ఐంది.. పరిస్థితులు మనిషిని ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకుపోతాయో ఎవ్వరం చెప్పలేం..
విల్ సి యు ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్