Tuesday, July 21, 2015

బాహుబలి సినిమా రివ్యూ - The Epic

బాహుబలి సినిమా ట్రయలర్ చూసాక మూవీ ఎలా ఐనా చూడాల్సిందే అనిపించింది.. కాని ఈ మధ్య ఏదైనా సినిమా చూడాలంటే మొదట కొన్ని వెబ్ సైట్స్ లో రివ్యూ చూసి బాగుంది అంటే అప్పుడు వెళ్ళేదాన్ని.. కాక పొతే బాహుబలి సినిమా ట్రయలర్ చూసాక రివ్యూ  తో పని లేకుండానే చూడొచ్చు అనుకున్నాను.. కాని టికెట్ ధర చూసి భయం వేసి కొద్ది రోజులు ఆగి చూద్దాం లే అని వదిలేసా.. కనీసం కథ ఐన తెలుసుస్తుంది లే అని రివ్యూలు చూడసాగాను.. 


రివ్యూస్ చూసాక చాలా మంది నెగటివ్ గా రేటింగ్ ఇస్తున్నారని అనిపించిన్ది.. రాజమౌళి సినిమాలు దాదాపు 99% బాగుంటాయి.. ఐతే ఇంత హైప్ వచ్చిన ఈ మూవీ కి తక్కువ రేటింగ్ వస్తుందని మాత్రం నిజమైనది అని అనిపించలేదు.. 

తీరా సినిమా చూసాక ఆ వెబ్ సైట్స్ ఇచ్చిన రివ్యూ అండ్ రేటింగ్ రెండూ తప్పే.. హాలీవుడ్ మూవీస్ లో 300 సినిమా చూసినప్పుడు చాల చాలా బాగుంది అనిపించింది..  కాకపొతే ఇది కాస్త  గ్రాఫిక్స్ మీద ఆధార పడ్డ సినిమా..  కాని బాహుబలి సినిమా చూసాక గ్రాఫిక్స్ అన్న ఫీలింగ్ లేకుండా మొత్తం సహజ సిద్ధంగా తీసిన రిచ్ మూవీ..ఒక ప్రాంతానికో లేక ఒక భాష కో సంబందించినది గా కాకుండా అందరు చూసే విధంగా ఉంది.. 
               ఆ జలపాతాల సీన్స్, యుద్ధ భూమి సీన్స్ హీరో విలన్ పర్సనాలిటీస్ అమోఘం.. అనవసరమైన పాటలు పెట్టి సాగదీయకుండా కథ మీద టైం పెట్టి ప్రేక్షకుడిని రెప్పపాటు కూడా సీట్ నుండి కదలకుండా కట్టిపడేస్తుంది  సీన్.. తమన్నా తో పోలిస్తే అనుష్క కి కాస్త తక్కువ నిడివి ఇచ్చినా తరువాత భాగం లో ఈమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు.. ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చాల బాగా చూపించాడు.. పిల్లలు పెద్దలు అందరూ చూసే విధంగా తీసారు.. 
           ఒక హిట్ సినిమా తీయాలి అంటే మన దేశం వదిలి ఇంకో దేశం పోనవసరం లేదు సీనరీస్ కోసం. గ్రాఫిక్స్ ని నమ్ముకుని మాత్రమే డబ్బులు ఖర్చు చెయ్యక్కర్లేదు.. కథ గాలికి వదిలేసి అనవసరం ఐన వినసొంపు కాని పని కి మాలిన పాటలు పెట్టి 3 గంటలు పెట్టి సినిమా సాగదీయ్యక్కర్లేదు.. ఐటమ్ సాంగ్ తప్పక ఉండాలి అనే వెర్రితనం అక్కర్లేదు.. బయట చూస్తున్న హింసలు మళ్లి మళ్లీ చూపించి సినిమా చివరలో ఇది తప్పు ఇలా చెయ్యకూడదు అని హింస పెట్టక్కర్లేదు.. కామన్ గా వస్తున్న సినిమాలకు కాస్త భిన్నంగా తీస్తే సగటు ప్రేక్షకుడు వినోదాన్ని అస్వాదిస్తాడు.. 

               ఈ మద్య కాలం లో వచ్చిన సినిమాలు దాదాపు ప్రేమ దోమ కక్షలు టెర్రరిసమ్ లేకపోతె పరమ బూతులతో కూడిన కామెడీ.. లేదంటే హీరోయిన్ ఒళ్ళు చూపించి 3 గంటలు అక్కర్లేని 6 పాటల తో ప్రేక్షకుడి ప్రాణాలు తోడేస్తున్నారు.. అదీ చాలదు అన్నట్లు కాస్త డబ్బున్న బడా మనుషులు తమ పిల్లల్ని హీరో లు గా పెట్టి చూసే వాడె పోతాడు అన్నట్లుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ హీరోలు/ హీరోయిన్స్ ఎలా అంటే కనీసం మొహం లో ఫీలింగ్స్ కాని హావ భావాలు కాని ఉండవు.. పెర్సనాలిటీ కూడా లేకపోయినా పెద్ద పెద్ద మాస్ ఫైట్స్.. ఇంకా వాళ్లకు రాసే డైలాగ్స్ బాబోయ్ నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.. ఎంత దారుణం అంటే లాస్ట్ కి ఫ్రీ గా కూడా యూట్యూబ్ లో 10 ని. ల పాటు కూడా చూడలేక ఏదైనా పాత సినిమా బాగున్నది మళ్లి మళ్లీ చూసుకోవాలనిపిస్తుంది.. ఇంకా టికెట్ కొని సినిమా హాల్ వరకు వెళ్లిన ప్రేక్షకుడు ఏమై పోతాడో.. 

బాహుబలి రెండవ భాగము కూడా బాగా తీయాలని ఇదే విధంగా ప్రేక్షకుడి ఆకట్టుకునేలా జోరు కొనసాగిస్తుందని ఆశిద్దాము.. 

Friday, July 17, 2015

వారం రోజుల్లో జుట్టు రాలిపోకుండా ఆపటం ఎలా? - How to prevent hair fall naturally in 1 week

                      జుట్టు రాలిపోకుండా  ఎలా ఆపటం అని గత 8 నెలలు గా చాలా బాధ పడ్డాను.. వాడని షాంపూ లేదు.. ట్రై చెయ్యని ఆయిల్ లేదు.. హెన్న, ఎగ్ సోన ఇలా అన్ని చేసి విసుగొచ్చింది..  నాచురల్ గా ఏమైనా మార్గాలు ఉన్నాయేమో అని ఇంటర్నెట్ , న్యూస్ పేపర్స్ చూసా .. కాని అవన్నీ త్వరగా ఫలితలిచ్చేవి కావని వదిలేసా.. మహా ఐతే ఒక నెల వరకు చూడగలం జుట్టు రాలటం ఆగిందా లేదా అని.. అంతే కాని నేలలకొద్ది ఎదురు చూడలేం కదా.. 

అనుకోకుండా ఒకరోజు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసా .. అందులో సారంశం.. " కరివేపాకు హెయిర్ ఫాల్ ని తగ్గించే గుణం ఉందని"
ట్రై చేస్తే పోయేదేం ఉందని ఇలా ట్రై చేశా.. ఆశ్చర్యంగా ఒక వారం రోజుల్లోనే ఫలితం కనిపించింది.. అందుకే వేరే ఎవరైనా నాలా బాధ పడితే, ఒకసారి ఇది ట్రై చేసి చూడండి.. 

  1. ఏదైనా హెయిర్ ఆయిల్ తీసుకోండి మీరు రోజు తలకు వాడేది ఏదైనా సరే eg. కొబ్బరి నూనె
  2. అందులో ఎండబెట్టిన కరివేపాకు (సుమారు ఒక 15 ఆకులు) , డ్రై మెంతులు కొంచెం, ఆవాలు నూనె(Mastard ఆయిల్)హెయిర్ ఆయిల్ కి సరిపడా(50/50%) కలిపి ఒక 2 రోజులు బాటిల్ లో వేసి మూత బిగించి వదిలెయ్యండి.. ఎండబెట్టిన కరివేపాకు అందుబాటులో లేనప్పుడు పచ్చి ఆకులు హెయిర్ ఆయిల్ లో వేసి అవి బాగా వేగిపోయే లా మరిగించి, చల్లగా ఐయ్యక బాటిల్ లో వేసుకోవాలి 
  3. కొంచెం ఈ నూనె గోరువెచ్చగా వేడి చేసి, ఆ తరువాత తలకు మాడు కి తగిలేలా మసాజ్ చేసుకోండి. 
  4. మసాజ్ చేసుకునేటప్పుడు తల ముందుకు వంచి హెయిర్ ముందుకు ఉంచి చేసుకోవాలి..ఇలా ఒక 15 నుండి 20 నిమిషాల వరకు మసాజ్ చేసి ఒక గంట తరువాత తక్కువ గాఢత గల ఎ షాంపూ ఐనా తీసుకుని తల కి స్నానం చేసేసుకోవాలి.. 

ఇలా ఈ ఆయిల్ రోజు విడిచి రోజు(వారానికి 3 సార్లు) తలకు పట్టించటం వల్ల జుట్టు రాలటమే  కాదు తెగటం కూడా తగ్గుతుంది.. ఐతే మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందొచ్చు.. 

  •  మార్కెట్ లో దొరికే ప్రతి షాంపూ ట్రై చెయ్యటం మానేసి ఏదైనా తక్కువ గాఢత గల షాంపూ (జాన్సన్ న జాన్సన్ బేబీ షాంపూ ఐన సరే ) ఒకటి వాడవలెను. 
  • పొడుగాటి జుట్టు కలవారు జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే ఏదైనా హెయిర్ కండిషనర్ వాడొచ్చు.. ఐతే కండిషనర్ మాడు కి మాత్రం తగలకుండా తల వెంట్రుకలకు మాత్రమె తగిలినట్లు చూసుకోవలెను. లేనిచో చుండ్రు సమస్యకు ఇది ఒక కారణం.. 
  •  వేడి నీళ్ళ తో స్నానం చేసేటప్పుడు తలకు వేడి నీళ్ళు కాకుండా వీలైనంత చల్లని నీళ్ళు వాడటం మంచిది.. లేదంటే జుట్టు మొదళ్ళ నుండి రాలిపోతుంది.. 
  • తడి జుట్టు పై దువ్వెన తో దువ్వకూడదు.. లేనిచో తడి జుట్టు త్వరగాఊడిపోతుంది.. 
  • హెయిర్ డ్రయర్ వాడకుండా ఏదైనా మెత్తటి టవల్ తో జుట్టు ఆరపెట్టటం మంచిది..  హెయిర్ డ్రయర్ వల్ల జుట్టు పొడి బారి పోయి నిర్జీవంగా మారి మెరుపు సహజత్వాన్ని కోల్పోతుంది.. 
  • తలకు స్నానం చేసిన మరుసటి రోజు కూడా 10 నుండి 15 నిమిషములు పైన చెప్పిన విధంగా మసాజ్ చేసుకుంటే జుట్టు పెరుగుదల త్వరగా ఉంటుంది
 నోట్: -
టైం వారం రోజులు అన్నాను కదా అని గ్యారంటీ గా తీసుకోకండి.. ప్రయత్నం చెయ్యటం లో తప్పు లేదు కదా.. నా విషయం లో వారం లోనే కనిపించిన్ది.. ఇలా చెయ్యక ముందు రోజు కి 100 - 150 వెంట్రుకలు చప్పున రాలిపోయేవి.. ఇలా చేసాక 15-20 కి చేరుకున్నాయి.. 3 వారాలు తరువాత కొత్త వెంట్రుకలు కనిపిస్తున్నాయి.. హెయిర్ వాల్యూం తల పైన ఎక్కువగా అనిపిస్తుంది..

Wednesday, October 30, 2013

మనసు - ఒక అందమైన అనుభూతి - అద్భుతమైన లోకం

లింగ భేదం, భాష భేదం లేని ఒక మధురమైన అనుభూతి మనసు. ఎంత దూరం ఐన ఏ ప్రదేశానికి ఐన క్షణాల్లో తీసుకుపోగలదు.  

బాధ కలిగి ఉన్నప్పుడు మనసు మరింత బాధ పెడుతుంది. అదే సంతోషం కలిగినప్పుడు మనసు మరింత ఉరకలేస్తుంది. అది బాధ ఐన, సంతొషం ఐన మనిషి  కోరుకొనేది  ఆనందమే..
               రోజంతా ఏ విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తామో, లేదా నిద్రించే  ముందు ఎవరిని గురించి తలుచుకుంటు పడుకుంటామో అటువైపే మనసు తీసుకు వెళుతుంది.. అలా మనకు కలలు కూడా అవే విషయాల మీద వస్తాయని అని అంటుంటారు .. ఒక్కోసారి అది నిజమే అని అనిపిస్తుంది. ఉదాహరణకు ఒక కళాశాలకు వెళ్ళే విధ్యార్థి కి తాను చదువుతున్న పాఠాల  గురించి రావొచ్చు .. లేదా తాను  రాయబోయే పరీక్షలు లో వచ్చే ఫలితాల గురించి.. యుక్త వయసులో వచ్చే ఆలోచనలు మరియు  మనసు  విధానమే వేరు.. కన్నె పిల్ల తనకు కాబోయే భర్త గురించి వచ్చే ఊహలే ఒక అందమైన స్వప్నము. మాటల్లో వర్ణించలేని, వేరొకరితో పంచుకోలేని ఒక మధురాతి మధురమైన అనుభూతి. మనసు గురించి ఎంత వివరించిన అది తక్కువే! 
               ఎక్కువగా  వేరొకరు చెప్పేది వినటం కన్నా, నా మనసు ఏమి చెబితే అదే చెయ్యాలి అని అనిపిస్తుంది..  అదే ఒక ఆడపిల్ల మనసు మగ వాడికి అర్ధం కాలేని చంచలత్వం..  ఎవరో కవి వర్ణించినట్లు ఆడది ఏది చెప్పినా సూటిగా చెప్పదు..మనసునూ  బైట పెట్టదు.. కనుక తన మనసు ని తెల్సుకుని అర్ధం చేసుకోవటం మగవాళ్ళకు చాలా కష్టమైన పని..కాని ఆడ పిల్ల మనసు, మగవాని మనసుతో కలిసినప్పుడే జీవితానికి ఒక అర్ధం, అందము వస్తుంది.. ఇరువురి లో ఏ ఒక్కరు కూడా ఆ అద్దము లాంటి మనసుని పగులకుండా కాపాడుకుంటే ఆ లోకం స్వర్గలోకం!!!!!!!!  

గమనిక :- నా ఈ చిన్ని పోస్ట్ మీ మనసుతో కూడా ఏకీభవించినట్లయితే మీ కమెంట్స్ అందించగలరు.. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి వ్రాసినది కాదు..