Tuesday, November 15, 2011

అమెరికన్ మరియు ఇండియన్

ఒక అమెరికన్ మరియు ఒక ఇండియన్ ఇద్దరు బార్ లో కూర్చుని మందు తాగుతున్నారు ...


Shot తరువాత shot........


అమెరికన్ తో భారతీయుడు ఇలా అన్నాడు..  'మా ఇంట్లో నన్ను ఒక పల్లెటూరి అమ్మాయి ని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు..ఆ అమ్మాయి చాల లక్షణంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కాని నేను మునుపెన్నడూ ఆ అమ్మాయి ని చూడలేదు కలవలేదు.' మా ప్రాంతం లో ఇది పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు అంటారు. కాని నేను ప్రేమించకుండా ఏ అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు ... ఇది నేను నిర్మొహమాటంగా ఇంట్లో చెప్పేసాను.. అందువల్లే నాకు కుటుంబ పరమైన సమస్యలు వచ్చాయి ఇప్పుడు.' అని చెప్పసాగాడు


ఆ తరువాత అమెరికన్ ప్రేమ వివాహాల గురించి ఇలా మాట్లాడసాగాడు, ... నా కథ చెప్తాను విను. "నేను ఒక విధవ ని పెళ్లి చేసుకున్నాను..ఆమె తో 3 సంవత్సరాలు dating చేసి గాడంగా ప్రేమించాను . కొన్ని సంవత్సరాల తరువాత , మా నాన్న గారు నాకు పుట్టిన కూతురు(step-daughter )  తో ప్రేమ లో పడ్డారు ఆ తరువాత ఆమె ని పెళ్లి చేసుకున్నారు , అందువల్ల మా నాన్న నాకు అల్లుడు ఐయ్యాడు మరియు నేను మా నాన్న గారికి పిల్లని ఇచ్చిన మామ ని ఐయ్యాను.


చట్టపరంగా  ఇప్పుడు నా కూతురు నాకు అమ్మ అవుతుంది and నా భార్య నాకు అమ్మమ్మ. ఇంకా నాకు కొడుకు పుట్టాక చాలా సమస్యలు తలెత్తాయి . నా కొడుకు మా నాన్న కి తమ్ముడు and అందువల్ల అతను నాకు అంకుల్ ఐయ్యాడు.


పరిస్థితులు ఇంకా దారునమైనాయి మా నాన్న కు కొడుకు పుట్టినప్పుడు. మా నాన్న కి పుట్టిన కొడుకు నాకు తమ్ముడు- నాకు మనవడు ఐయ్యాడు . ఫైనల్ గా నాకు నేనే తాతయ్యని ఐపోయాను  మరియు నాకు నేనే మనవడు కూడా . ఇప్పుడు చెప్పు కుటుంబ పరమైన సమస్యలు నీవా? లేక నావా?.'


అప్పుడు ఆ భారతీయుడికి దిమ్మ తిర్గి మైండ్ బ్లాక్ ఐంది మహేబాబు చెప్పినట్లు..
Note: ఈ జోక్ ఒక స్నేహితుడు నాతో షేర్ చేసుకోగా తెలియని వాళ్ళకు షేర్ చేస్తున్నాను.. ఇది నేను రాసిన జోక్ ఐతే కాదు.. I am నాట్ హోల్డింగ్ ఎనీ copyrights
English version :-
One American and an Indian were sitting in a bar & drinking


Shot after shot.


The Indian said to the American, 'You know my parents are forcing me to get married to this so called homely girl from a village whom I haven't even met once.' We call this arranged marriage. I don't want to marry a woman whom I don't love... I told them that openly and now have a hell lot of family problems.'


The American said, talking about love marriages... I'll tell you my story. 'I married a widow whom I deeply loved and dated for 3 years. After a couple of years, my father fell in love with my step-daughter and married her, so my father became my son-in-law and I became my father's father-in-law.


Legally now my daughter is my mother and my wife my grandmother. More problems occurred when I had a son. My son is my father's brother and so he is my uncle.


Situations turned worse when my father had a son. Now my father's son, my brother is my grandson. Ultimately, I have become my own grand father and I am my own grandson. And you say you have family problems.'


The Indian fainted......
Note: I am not holding any copyrights of this joke.. one of my friend shared with me now i am sharing with the people who never heard this joke.. have nice day..

Sunday, November 13, 2011

స్నేహం vs ప్రేమ

                                        అతి కొద్ది మంది కి మాత్రమే ఇది అర్ధం అవుతుంది ఈ రెండింటికి భేదము.. మనం చిన్నప్పుడు చదువుకునే పాటశాల నుండి చాల మంది ని కలుసుకుంటాము.. అందులో మనతో మాట్లాడి మనతో స్నేహం చేసే వాళ్ళు చాలా తక్కువ.. ఆ తక్కువ మంది లో కూడా మన మనసు కి చేరువగా స్నేహం చేసేవాళ్ళు ఇంకా తక్కువ గా ఉంటారు.. అలాగే మన కి మన స్నేహితులలో నచ్చే విషయాలు కూడా తక్కువ గా ఉంటాయి.. సో బెస్ట్ ఫ్రెండ్స్ మహా ఐతే ఒక ఇద్దరో ముగ్గురో ఉంటారు 10 వ తరగతి చదువుకునే రోజుల వరకు అసలు అప్పటి వరకు ప్రేమ అనే మాటకు అర్ధమే తెలీదు .. కాకపోతే మనతో పాటుగా ఇంటర్ చదువు కోసం వచ్చే ఇద్దరో ముగ్గురో దొరకవచ్చు  అంటే మనసుకు నచ్చిన స్నేహితులుగా.. ఈ స్నేహితులు మన ఇంటి పరిసరాల వరకే పరిమితం..
                           అలా అక్కడ కూడా కొత్త స్నేహితులు ఇతర ప్రదేశాల నుండి అంటే మన సిటీ/టౌన్ నుండి వచ్చిన వాళ్ళు పరిచయం అవుతారు.. అందులో మన మనసు కొంత మందిని మాత్రమే ఎంచుకుంటుంది..ముఖ్యంగా మన ఇష్ట అఇస్టాలు గౌరవించి  లేదా మన వాటి తో మ్యాచ్ ఐయ్యే వాళ్ళే  మన కు స్నేహితులు గా దొరుకుతారు.. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మన మనసు ఎప్పుడు స్నేహం చెయ్యాలని అనుకోదు..ఇక ఈ వయసు లో ప్రేమ గురించి కొంచెం కొంచెం మనసుకి తెలుస్తూ ఉంటుంది కాని స్నేహానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాము.. కాని ఎప్పుడు ప్రేమ గురించి తెల్సుకోవాలనే కుతూహలం ఉంటుంది.. అలా ఎవరైతే ఈ రెండిటి మధ్యలో కొట్టు మిట్టాడక చదువు మీద శ్రద్ధ పెడతారో వారికో గమ్యం ఏర్పడుతుంది.. అంటే ఆ రెండు సంవత్సరముల తరువాత ఏమి చెయ్యాలి అనే లక్ష్యం.. కాని మరో ఇద్దరు లేదా నలుగురు తోడు అవుతారు ఇంకా పై చదువులకి వెళ్ళే వాళ్ళు ఐతే..
             ఇక ఆ పై చదువుల్లో మరి కొంత మంది దేశం మూలల నుండి వచ్చిన కొత్త మనుషుల్లో మనకి స్నేహితులు అవుతారు.. అయితే ఇక్కడ స్నేహానికి కన్నా ప్రేమ కి విలువ ఇచ్చే ప్రయత్నం ఎక్కువ.. మరి అది సినిమా ల ప్రభావమో లేక మన చుట్టూ తిరిగే స్నేహితుల పుణ్యమో తెలియదు కాని మన శ్రద చదువు స్నేహం కన్నా ఒక తోడు ని వెతుక్కునే పని ఎక్కువగా ఉంటుంది.. అది కొంత మంది కి టైం పాస్ కొంత మంది కి ప్రెస్టేజ్.. ఏదో ఒకటి అనుకోండి ఇక్కడ.. ఇందులో కూడా నిజమైన ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు...కాని స్నేహం మాత్రం ఖచ్చితంగా నిజాయితీ గా ఉంటుంది.. ఇక్కడ ఈ వయసు లో పరిచయం ఐన వాళ్ళు మనకు వివాహం ఐన తరువాత కూడా మనతో స్నేహాన్ని కొనసాగిస్తుంటారు..     
                                ఇలాంటి సమయం లో ప్రేమించామా లేదా అనే అని ఆలోచించే వాళ్ళే కాని ఆ ప్రేమ ఎంత వరకు పెళ్లి వరకు కొనసాగుతుందో అని ఆలోచించే వాళ్ళు తక్కువ.. ఎందుకంటే ఆ వయసు లో వాళ్ళకి రాబోయే కాలానికి ఏమి కావాలో (అంటే ఇంకా వాళ్ళ కాళ్ళు మీద వాళ్ళు నిలబడలేదు కనుక ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కనుక) తెలియదు..ఇక్కడ కూడా తన ప్రేమ ని ఎలా ఐన దక్కించుకోవాలి అనుకునే వాళ్ళే ఎక్కువ ఈ మధ్య కాలం లో.. ఎదుటి మనిషి మనసు లో ఏమి ఉంది అనేది వాళ్ళకి అనవసరం.. అలా అని అందరు ఇలాగే ఉంటారు అనుకోలేం.. కొంత మంది నిజంగా మనస్పూర్తిగా ఇష్టపడి ప్రేమిస్తున్నాం అని చెప్పినా దాన్ని అలుసుగా తీసుకుని టైం పాస్ చేసేవాళ్ళు ఉంటారు.. అలా ఎప్పుడైనా ఆ వ్యక్తి కి వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలిస్తే ప్రేమ మీద నమ్మకం పోయి వాళ్ళని చంపే దశకి కూడా వచ్చేస్తారు.. అది వాళ్ళ తప్పు కాదు ఆవేశం అలా చేస్తుంది.. సరే మరి నిజమైన స్నేహం ఏంటి?? మరి నిజమైన ప్రేమ ఏంటి అని మీరు అడగవచ్చు!!!
                            నా ఉద్దేశం లో నిజమైన ప్రేమ అంటే పెళ్లి కి ముందు ఉన్న ప్రేమ పెళ్లి ఐన తరువాత కూడా ఉండాలి.. ఆ మనిషి దగ్గర ఉన్నా లేకున్నా తనలో ఉండే ప్రేమ లో మాత్రం మార్పు ఉండకూడదు..ప్రక్టికాల్ గా చెప్పాలంటే స్నేహం ప్రేమ గా మారొచ్చు కాని ప్రేమ స్నేహంగా మారలేదు.. ఒక మనిషిని అప్పటిదాకా ప్రేమికురాలు/ప్రేమికుడు గా ఊహించుకుని ఒకేసారి స్నేహితుడు/స్నేహితురాలు అని అనుకోడం సాధ్యం కాదు.. నిజమైన స్నేహం ఎప్పుడు స్నేహితుడు దగ్గర నుండి సయం ఆశించకుండా తను ప్రతి సమయం లోను నేను ఉన్నానని తోడు గా నిలుస్తుంది...
                         అనగా మనం ఏ సహాయం చేసినా తిరిగి ఆ సహాయం అదే స్నేహితుడి నుండి తిరిగి ఆశించకుండా చెయ్యాలి కాని నేను ఎన్ని చేసినా స్నేహితుడు ఎందుకు అర్ధం చేసుకుని తిరిగి చెయ్యటం లేదు అని అనుకూడదు.. నిజంగా మనం ఒకరికి సహాయం చేస్తే వారే అక్కర్లేదు వేరే ఏదో ఒక రూపం లో మనకు సహాయం దేవుడు అందిస్తాడని నా ఫీలింగ్..
పైన చెప్పిన వివరాలు మన చుట్టూ నిత్యం జరుగుతున్న సంగటనలు మాత్రమే  ..... ఏ ఒకరిని ఉద్దేశించి మాత్రం కాదు..     
 

నేటి తరం యువతీ/యువకుల పెళ్ళికి సంబంధించి సమస్యలు

ఈ మధ్య కాలం లో నేను గమనిచించిన అంశాలు.. ఇవి నా చుట్టూ జరిగిన అంశాలు మాత్రమే ఎవరినైనా కించపరిచేట్లుగా ఉంటే క్షమించగలరని ప్రార్ధన..
అ) అబ్బాయిలు :-


* అబ్బాయిలు మునుపటి కాలం తో పోల్చి చూస్తే చాల వరకు తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి చాల వరకు ఆప్షన్స్ తగ్గించుకున్నారు. ఉదాహరణకు ఒక అమ్మాయి చదువుకుని ఉంటే ఏదైనా ఉద్యోగం లో స్థిరపడి ఉంటే ఇద్దరి సంపాదనతో కుటుంబం ఇద్దరి చేతులు మీదుగా నడపవాచు అని కొందరు అంటే కట్నానికి పెద్ద గా  importance  ఇవ్వకుండా (ఒక వేల అమ్మాయి తల్లితండ్రులు ఇష్టం మేరకు ఎంత ఇస్తే అంట తీసుకోడానికి సిద్దం అని అంతే కాని ఇంత కావాలి అని డిమాండ్ చెయ్యకుండా ). ఇక్కడ అమ్మాయి అందానికి పెద్ద ప్రేఫరేన్సు ఇవ్వరు ఏదో అవెరగె గా ఉన్న చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు


* ఒక వేళ అమ్మాయి అందంగా ఉంటే కట్న కానుకులు ను కూడా ఆశించని వాళ్ళు ఉన్నారు


* ఇక అమ్మాయి ఎం జాబు చెయ్యకున్న ఎంతో కొంత చదువుకుని ఉండాలి సో దట్ తన పిల్లల వరకు ఐన తను చదివిన్చుకునేంత.. అలంటి అమ్మాయి విషయం లో అబ్బాయిలు ఎంతో కొంత కట్నం ఇంత కావాలి అని ఆశిస్తున్నారు


*ఇక అమ్మాయి కి అబ్బాయి కి నచ్చింది అంటే చాలా మటుకు తన వేపు నుండి సర్దుకుపోయే తత్వానికి మొగ్గు చూపుతున్నాడు అంటే రంగు, పొడుగు, లావు ఇలా చాలా విషయాల్లో పర్వాలేదు లే అన్నట్లుగా..
*పాత కాలం లో అంటే మా నాన్న గారి కాలం లో అమ్మాయి కి మాత్రమే ఫోటో తీసినప్పుడు ఫోటోగ్రాఫర్ ఇలా ఉండు అలా పోస్ ఇవ్వు అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ తిప్పలు అబ్బాయి లకు వచ్చాయి అనిపిస్తుంది
ఈ మధ్య అబ్బాయి లకు కూడా పెళ్లి చూపులకు ప్రత్యేకంగా ఫోటో  ఫోటోగ్రాఫర్ తో తీసుకోవాల్సి వస్తుంది
*కొన్ని సంఘటనలు ఇలా కూడా ఉన్నాయి అబ్బాయి ఎంత చదువుకున్న వాడు ఐనా అవతలి అమ్మాయి ఎంత చదువుకున్నది ఐనా జీవితం లో తనకాళ్ళ మీద తను నిలబడగలిగినా కట్నం విషయం లో మాత్రం లేదా కానుకల విషయం లో ఐనా అస్సలు తగ్గటం లేదు ముక్యంగా అగ్రకులాల్లో ఇది ముఖ్యంగా కనిపిస్తుంది ఉదాహరణకు కట్నం వద్దు అని చెప్పిన ఈ మధ్య బంగారం ధర పెరిగింది కదా సో ఎక్కువ బంగారం అడుగుతున్నారు అదేదో పిల్ల తల్లిదండ్రులు పందిస్తున్నట్లు ....ఈ విషయం లో మాత్రం చాల మార్పు అవసరం..
బ) అమ్మాయిలు
ఇక అమ్మాయి లకు సంబంధించి ఐతే కాస్త ఎక్కువ ఒప్షన్స్ పెంచారు అనిపిస్తుంది.భారత దేశం లో కొడుకు కి ఇచ్చే విలువ పుణ్యమా అని అమ్మాయిలు సంఖ్య రాను రాను తగ్గుతూ వచ్చింది.. దాంతో అమ్మాయి ల డిమాండ్ పెరిగిపోతు ఉంది. అవుట్ అఫ్ 1000 అబ్బాయిలకు  సుమారు గా 900 మాత్రమే అమ్మాయి లు ఉంటున్నారు.. అలాగే చదువుకుని ఉద్యోగం లో స్థిర పడ్డాక పెళ్లి చేసుకుందాం అనుకునే అమ్మాయి లు పెరిగారు.. అలాగే అమ్మాయి ఉద్యోగం లో స్థిరపడితే కట్నం సమస్య ఉండదు అనుకునే తల్లిదండ్రులు కూడా పెరిగారు.. అంటే భారత దేశం ఈ విషయం లో అభివ్రుది చెందింది అనే చెప్పుకోవాలి అనుకోండి.. కాని అబ్బాయి లకే కష్టాలు మొదలుతున్నాయి ఎలా అంటారా ఇలా ఈ దిగువన పాయింట్స్ చదవండి
* అమ్మాయి ఎలా ఎంత అందంగా ఉన్నది అనవసరం తనకు మాత్రం అందమైన మొగుడు రావాలి  అనుకుంటుంది.. అందుకనే ఎన్ని పెళ్లి సంబంధాలు ఐనా తిరస్కరిస్తూ ఉన్నారు ఈనాటి అమ్మాయి లు వాళ్ళకి నచ్చిన అబ్బాయి దొరికే దాక అంతే కాని తల్లిదండ్రులు బలవంతానికి లోన్గిపోడం లేదు
* తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కి ముందు వెనక ఆస్తి తో పాటు పెళ్లి ఐయ్యక తన ఇష్టాలు కి ఎంత వరకు ప్రాముక్యత ఇస్తాడో ముందు సరి టెస్టింగ్ కూడా చేస్తున్నారు అంటే పెళ్ళికి ముందే కొంత వ్యవధి లో అతని మనస్తత్వం ని చదవటం లో
* ఉద్యోగమ పురుష లక్షణం కాని అబ్బాయి కి ఉద్యోగం ఒక్కటే ఉంటే సరిపోదు ఆమె నచ్చిన ఫీల్డ్ లో మాత్రమే ఉండాలి..జీతానికి కూడా ఒక రేంజ్ పెడుతున్నారు..
*ఒక వేళ ఇంట్లో అమ్మ నాన్న బలవంతానికి పెళ్లి కి ఒప్పుకున్నా తీర పెళ్లి రోజులు దగ్గర పడే సమయానికి వేరే అబ్బాయి ని ప్రేమించ అంటూ వేలిపోతున్నారు..( అంటే అందరు అమ్మాయి లు ఇలాంటి వాళ్ళని నా ఉద్దేశం కాదు నేను చూసిన చాల సంఘటనలు ఉన్నాయి ) పాపం ఆ పెళ్లి చేసుకోవాలన్న అబ్బాయి ఎం తప్పు చేసాడు చివరి నిమిషం లో అతని పరువుతీయటం ఎంత బాధ పెడుతుంది అతని ని అతని ఫ్యామిలీ ని
*కొంత మంది అమ్మాయి లు ఐతే ఉద్యోగం అబ్బాయి కి ఉన్నా S/W  లో ఆ అబ్బాయి ఒక్కసారి ఐనా ఆన్  సైట్ కి వెల్లడ లేదా అని అడుగుతున్నారు.. వెళ్ళాక పోతే అతను పనికిరానివాడి గా జమకడుతున్నారు

*కాని అది ప్రేమ వివాహం ఐన లేదా పెద్దలు కూర్చిన పెళ్లి ఐన పెళ్లి అయిన రెండు మూడు సంవత్సరాలు వరకు ఇద్దరి మధ్య కీచులాట మాత్రం తప్పటం లేదు.. వాటిని అధిగమించి ఓర్పు తో ఉన్నవాళ్లు ఆ బంధాన్ని ముందుకు నడుపుతున్నారు.. అలా కానప్పుడు ఎవరికి వారె అన్నట్లుగా విడాకులకు సిద్ధపడుతున్నారు..ఒకప్పుడు ఇచ్చిన విలువ ఆ బంధానికి నేటి సమాజం ఇవ్వటం లేదు అని అనిపిస్తుంది ఒక్కోసారి..     
చెప్పుకుంటూ పోతే ఇలా చాలా కనిపిస్తాయి అనుకోండి.. మీకు కూడా ఇలాంటి సంగటనలు ఎదురు పడవచ్చేమూ..keep smiling don't take the above points as serious

Friday, November 11, 2011

మరో హ్యాపీ డేస్ తో ప్రేమ కథ --Episode 6

ఎపిసోడ్ 6 :-
============
సరిగ్గా ఒక సంవత్సరం తరువాత లహరిక కాంపస్ placements లో ఏదో కంపనీ కి సెలెక్ట్ ఐంది.. ఆ తరువాత ఏదో కంపెనీ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వస్తే వెళ్ళింది.. ఇన్ని నాళ్ళు కూడా రోహన్ ని ఏ ఒక్కరోజు మర్చిపోలేదు.. ఎందుకో ఆమె మనసులో నిత్యం మెదులుతూనే ఉన్నాడు..
                                  ఒక రోజు అనుకోని విధంగా ఆస్ట్రేలియా లో లహరిక కఫ్ఫీ తాగుతూ ఉండగా తన కు ఎదురుగా ఉన్న కుర్చీ లో ఎవరో తెలుగులో మాట్లాడుతున్నట్లుగా కనిపించింది.. ఏదో ఎక్కడో విన్న స్వరం లా అనిపించింది లహరిక.. ఒక్కసారిగా లేచి చూసింది.. చూడబోతే గుండె లబ్ డబ్ అని కొట్టుకోసాగింది.. ఎక్కడో తెలియని మాటల్లో చెప్పలేని వింత అనుభూతి.. చూడబోతే అవతలి వ్యక్తి ఎవరో కాదు తాను ఇన్ని నల్లు గ వెతుకుతున్న రోహన్.. లహరిక మనసు ఎంతో వేగంగా అతని వేపు ప్రయాణించింది.. ఒక్కసారిగా ఏదో వింత లోకం లో కి వచ్చినట్లు తనకు కావాల్సిన గిఫ్ట్ భగవంతుడు ఇచినట్లు ఎలాగో ఉంది తన మనసుకి.. మాటలు నోటి వెంట ఉప్పెనల పొంగి పోతున్న బైటకు ఎం వినపడటం లేనట్లుగా ఉంది..

                                  లహరిక మెల్లి గా రోహన్ వేపు గా వెళ్ళసాగింది.. మనసు లో చాలా ప్రశ్నలు : రోహన్ నన్ను గుర్తిస్తాడా? లేదా అసలు నేను గుర్తు ఉండే అంతగా అతని మనసులో నాకు స్థానం ఉందొ లేదో.. నేను మాత్రమే అతన్ని ప్రేమిస్తున్నాను కాని అతని మనసులో ఏమి ఉందో అని పరి పరి విధాలుగా ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. కాని ఏదో ఆనందం ఇన్ని రోజుల తరువాత అతన్ని కల్సుకుంటున్నాను అని.. ఈలోగా రోహన్ ని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించి వెనుదిరిగి చూడబోయాడు.. చూస్తే ఏదో కల లాగ అనిపించింది ఒక్క క్షణం కళ్ళ  ఎదుట లహరిక తన మనసు దోచిన ఒకే ఒక ఆడ పిల్ల.. ఆమె తన నోటి నుండి మాట విప్పక ముందే రోహన్ "ఎలా ఉన్నావ్ లహరిక?? " అని అడిగేసాడు.. ఇంకా లహరిక ఆనందానికి అంతు లేదు అంటే రోహన్ తనని మర్చిపోలేదు అని ఫిక్స్ ఐంది.. మెల్లి గా ఒకరినొకరు గురింది వివరాలు తెల్సుకోగాలిగారు వాళ్ళు ఆ ప్రదేశానికి ఎలా వచ్చింది ఇప్పుడెల సెటిల్ ఐంది ఇలా..
                                 లహరిక ని చూడగానే ముందు గా రోహన్ కి వచ్చిన ప్రశ్న"లహరిక కు పెళ్లి అయిపోయిందేమో" అని.. కాని అవ్వలేదు అని తరువాత అర్ధం ఐంది.. మనసులో చిన్న ఆస ఇంకా తన ప్రేమ కి ఏమైనా అవకాసం ఉందేమో అని..
                                 ఇక అది మొదలు ఏదో ఒక విషయంగా ఒకరినొకరు రోజు కలుసుకోవటం మొదలైంది.. ఎవరో చెప్పినట్లు దేని గురించి ఐతే నిత్యం స్మరిస్తూ ఉంటామో అదే మన చుట్టూ జరుగుతూ ఉంటుంది.. ఎప్పుడు ఒకరి ప్రేమ ని ఒకరు తలుచుకోవటం తప్ప ఎదుట పెట్టింది లేదు.. సినిమా లలో చూపించటం అనే కాదు అమ్మాయి ఐనా అబ్బాయి ఐనా వారి మధ్యలో ఇంకొక అబ్బాయి లేదా అమ్మాయి వస్తే నే అసలు ప్రేమ బైట పడుతుంది సరిగ్గా ఇదే జరిగింది లహరిక విషయం లో.. ఇన్ని నాళ్ళు సైలెంట్ గా ఉన్నా   ఇరువురు ఏదో డాన్సు ప్రోగ్రాం ఒకటి చూడడానికి వెళ్లారు.. అక్కడ ఇరువురుకి చెరో పాట్నర్ దొరికారు.. కాని ఇరువురి మనసులు వాళ్ళ మీద లేవు.. మనసులో కుళ్ళు మొదలైంది..తరువాత గొడవ ఐంది ఇంకా చెడ మడ తన పాట్నర్స్ ని తిట్టేసి వీరిరువురు మనసులో మాట బైట పెట్టసగారు.. కాని ఇరువురు ఆ ప్రదేశం నుండి ఒక్కసారిగా వదిలిపెట్టి వేలిపోసాగారు తమ తమ నివాసం కి..ఇంటికి వెళ్ళాక ఇద్దరికీ మల్లి మాట్లాడాలి అనిపించింది.. ఇద్దరి మనసులో ఉన్నది ఒకే మాట అని అప్పటి కి గాని తెలియలేదు.. ఇద్దరు మొతానికి హ్యాపీ.. గాల్లో తేలిపోతున్నారు.. ఇంకా అప్పటి నుండి మొదలు ఒకరి ఇష్టాలు ఒకరు చెప్పుకోవటం..
                                 వారు కాలేజీ లో ఉండగా జరిగిన గొడవలు సంగటనలు గుర్తు చేసుకోడం అబ్బో ప్రేమ బైట పెట్టక ప్రేమికులకు మాటలే కరువ.. ఫోన్ బిల్లు ఖర్చు గాని.. కాని ప్రేమ ని బైట పెట్టేసాక అన్ని అనుకూలంగానే ఉంటాయి అనుకోకండి.. ఇక్కడే చాల ఓర్పు అవసరం.. ప్రతీ చిన్నదానికి లహరికకు చిన్న పిల్ల మనస్తత్వం అందువల్ల వారిద్దరికీ తరుచు గా గొడవలు కూడా వచ్చేవి..  అబ్బాయిలు సహజంగా చాల మచుర్డ్ గా ఆలోచిస్తారు.. కాని అతి కొద్ది అమ్మాయి లు వారి లాగా ఆలోచించగలుగుతారు .. అందులోకి ఆడ పిల్ల మనసు అర్ధం చేసుకోడం చాలా కష్టం.. అది ఎంత చదివినా ఇంకా అర్ధం కాలేదు అనే సముద్రం లాంటిది.. రోహన్ ఒకటి అనుకుని ఏదైనా చేస్తే అది ఇంకోలాగా ఉండేది లహరిక స్పందన.. ఒక్కోసారి తాను కరెక్ట్ ఐనా లహరిక పోట్లడుతున్నట్లుగా అనిపించేది.. కాని వారిరువురు దూరంగా వెళ్ళాక ఇద్దరి చేష్టలు చిలిపిగా అనిపిస్తూఉంటాయ్ అందువల్ల వారి గొడవ ఏది పెద్ద తీవ్రమైన గొడవ ఐయ్యేది కాదు.. అది ఒకరిన్కొఅరు అర్ధం చేసుకునేందుకు దోహద పడేది.


                                 కాని ఇద్దరి మధ్య ఏదైనా సంబంధంచెడిపోవాలంటే దానికి వేరొకరు ఐనా కారణం ఉండాలి లేదా ఒకరికొకరు అపార్ధం చేసుకుని ఐనా ఐ ఉండాలి.. లహరిక ఆఫీసు లో పని చేసే తన స్నేహితుడు ఒక అబ్బాయి తన జీవితం లో జరిగిన సంఘటనలు లహరిక మనసుని ప్రభావితం చేసేలా మాట్లాడేవాడు. అందువల్ల తన జీవితం కూడా అలా ఆద్దేమో అనే భయం లో ఉండేది నిత్యం లహరిక.. ఆ అబ్బాయి ఒక అమ్మాయి వల్ల మోసపోతాడు.. అలా ప్రేమించుకునే వాళ్ళు తమ జాగ్రత్త లో తాము ఉండాలి అనే విధంగా హెచ్చరిస్తుంటాడు లహరిక ని.. కాని ఈ అమ్మాయి ఇంకో విధంగా అతన్ని అర్ధం చేసుకుని రోహన్ ని కూడా ఇబ్బందుల్లో పెడుతూ ఉంటుంది.. అలా అని ఆ అమ్మాయి కి రోహన్ మీద అనుమానం కూడా కాదు.. దాన్ని అతి ప్రేమ అని కూడా అనుకోవచ్చు లేదా అది జాగ్రత తన జీవితం మీద అని ఐనా అనుకోవచ్చు.. కాని ఏదో ఉప్పెన వారి వేపు గా దూసుకు వస్తుంది అది ఏంటో నెక్స్ట్ ఎపిసోడే లో చూద్దాం..   

మరో హ్యాపీ డేస్ తో ప్రేమ కథ --Episode 5

ఎపిసోడ్ 5 :-

=========

                   ఎవరినైనా మనం ఇష్టపడటం మొదలెడితే మన మనసు గాలి కన్నా వేంగంగా తేలికకగా ఆ మనిషి ఆలోచనల్లో తెలిపోఎట్లుగా చేస్తుంది.. ఎప్పుడు వాళ్ళ ప్రేసేన్సు నే కోరుకునేల కూడా చేస్తుంది.. ఆ మనసులో ప్రేమ తనకు తప్ప పక్కన ఉన్న వాళ్ళకి తెలియకుండా దాచేవాళ్ళు బైటకి ఇష్టం( జస్ట్ లైకింగ్) అని చెప్తూ లోపల ప్రేమించేస్తూ ఉంటారు ఇష్టపడిన వ్యక్తిని .. సరిగ్గా ఇదే జరుగుతూ ఉంది రోహన్ తో..
                      శివ ముందు బైట పడకుండా తనలో పుట్టుకొస్తున్న ప్రేమ లహరిక మీద ఉన్నది ఇష్టమా లేక ప్రేమ అనే కన్ఫ్యుసన్ ఉంటూ ఒక రోజు ఖచ్చితం చేసుకున్నాడు.. ఎలా అనగా.. ఎప్పుడైతే లహరిక తన ఇంటికి వెళ్లి తనకు కనపడకుండా పోయిందో ఆ సమయం లో తమ మనసు పదే పదే తనకోసం వెతకసాగింది.. తనకు తెలియకుండా నే లహరిక గురించి రాత్రి నిద్రపోయే వేళలో కలలు వచ్చేవి.. పొద్దున్న ఎంత ప్రయత్నించినా సరే నిద్ర నుండి మేల్కొనాలి అంటే ఇష్టం అనిపించేది కాదు.. అలాగే కలల్లో తేలి ఆడాలని అనిపించేది.. ఇదంతా తన తోనే ఎందుకు జరుగుతుందా అని ప్రశ్నించుకునే వాడు.. ఒక వేల శివ చెప్పినట్లు గ నాది ప్రేమ లేక ఆకర్షణ అని మల్లి కన్ఫ్యుసన్ లో పడిపోయేవాడు.. అసలు ఇదంతా కాదు అని నేను నాలాగే ఉంటాను.. ఈ ఆలోచనలు నాకు రాకుండా కంట్రోల్ చేసుకుంటాను అని గట్టిగ అనుకునేవాడు.. కాని అది తన వల్ల కాదు అని మళ్లీ మనసు మార్చుకునేవాడు.. (అదే నేమో ప్రేమ కి ఉండే శక్తి.. ప్రేమ లో పడ్డ వాళ్ళు పడే దాక తెల్సుకోలేరు.. పడ్డాక మర్చిపోలేరు.. అదే attraction  ఐతే ఒక్కోసారి ఒక్కో వ్యక్తి మీద కి పోతుంది మనసు .. కాని ప్రేమే ఐతే ఒక్క మనిషి నే మనసు వెంటాడుతుంది.. దాని నుండి బైటకి రావాలంటే కాలమే తీసుకు రావాలేమో కాని వారంతట వాళ్ళు బైట కి రాలేరు..అని పలువురు అనగా విన్నాను.. మరి అది ఎంత వరకు నిజమో ప్రేమ లో పడ్డ వాళ్ళకే తెలియాలి..) ఇలా తన తో జరిగే సంఘటనలు అన్ని ఒకరోజు శివ తో అనుకోని సంఘటన లో చర్చించాల్సి వచ్చింది రోహన్ కి..
                                 రోహన్ మనసు తెల్సిన వాడు కనుక శివ రోహన్ కి చెప్పాడు.. "ఎప్పుడైనా మనం ఒక వ్యక్తి గురించి దగ్గర ఉన్నప్పుడు పెద్దగా తెల్సుకోలేము కాని.. ఆ మనిషి దూరంగా ఉన్నప్పుడు బాగా తెల్సుస్తుంది..అలాగే నీ మనసు నేను ఎంత చెప్పిన ఒప్పుకోలేదు ఆ అమ్మాయి మీద నీకు ఉన్నది ప్రేమ అని. కాని పోను పోను నీకే తెల్సింది ఆ అమ్మాయి నీకు కొంత సమయం దూరం అవ్వగానే.. నీకు ఆ అమ్మాయి ప్రేసేన్సు నచ్చుతుంది.. ని మనసులో ఉన్నది సరే మరి ఆ అమ్మాయి మనసు సంగతి ఏంటి అది తెల్సుకో!!!!!!!!! " అని చెప్పా సాగాడు.. ఏదో గుర్తు వచ్చినట్లుగా అక్కడ నుండి లేచి వెళిపోయాడు రోహన్..

                                 మరుసటి రోజు ఉదయం కాలేజీ కి వెళ్ళాడు.. అక్కడ లహరిక ఏదో ఆలోచిస్తూ కనిపించింది.. తక్షణం ఆలోచనల్లో పడ్డాడు. మూవీస్ లో చూపిస్తారు వెంటనే వెళ్లి ఐ లవ్ యు అని అంటారు అది అంట ఈజీ కాదు రియల్ లైఫ్ లో.. ఎందుకు అంటే అవతల అమ్మాయి + ఓర - రిప్లై ఇస్తుంది.. ఇంకా నా విషయం లో ఆలాంటి రెస్పాన్స్ బేర్ చేయాల్సి వస్తే అమ్మో అని అనుకున్నాడు.. అలా కాదు! నా అంతట నేను ఆ అమ్మాయి కి నా మనసు లో మాట చెప్పను.. ఆ అమ్మాయి నా మనసు తెల్సుకునే ల చేస్తాను.. అప్పటి దాక నా ప్రయత్నం చేస్తాను.. అందులో ఫెయిల్ ఐన సక్సెస్ ఐన నాకు ఒకే. ఒక వేళ ఫెయిల్ ఐన ఆమె పైన ఉన్న నా ప్రేమ ని జీవితాంతం మనసు లో దాచి పెట్టుకుంటాను కాని ఆ అమ్మాయి కి హాని చెయ్యను" అని అనుకున్నాడు..( అన్ని జీవితం లో అనుకున్నట్లే అయిపోవు కదా..)
                                 అప్పుడే రోహన్ సీనియర్ ఒకడు లహరిక కు ఏదో చెప్పాలని వచ్చి ఆమెని బాగా ఇబ్బంది పెడుతున్నాడు.. లహరిక మొహం లో నవ్వు పోతు భయం కనిపిస్తూ ఉంది.. ఏం జరుగుతుందో అక్కడ తెల్సుకుందాం అన్నట్లుగా అటువేపు గా వెళ్ళాడు.. చూడబోతే షరా మామూలే.. ఆ అమ్మాయి కి ప్రోపోసే చేస్తున్నాడు .. ఆ అమ్మాయి కి అవేం ఇష్టం లేదు అని తనని వదిలెయ్యమని వేడుకుంటూ ఉంది.. జూనియర్ కదా సో భయపడుతూ ప్రార్ధించింది.. రోహన్ కి ఏకాక్డలేని కోపం వచ్చేస్తు ఉంది కాని తను కూడా ఆ అమ్మాయి కి సీనియర్ ఏ కదా.. ఒక వేళ సమె రిప్లై ఆ అమ్మాయి నుండి తనకి కూడా వస్తే అన్నట్లుగా ఖంగు మన్నాడు ఒక్కసారిగా.. సో అలా భయం తో కూడిన ప్రేమ తనకి వద్దు.. కాని ఒక విషయం లో క్లారిటీ వచ్చింది రోహన్ కి ఆ అమ్మాయి కి ఆలాంటి విషయాలు నచ్చావు అని చెప్పింది అంటే ఇంట వరకు ఎవరు ఆమె మనసులో ఎంటర్ కాలేదు అని.. చాలా ఆనందంగా ఫీల్ ఐ.. ఎగిరి గంతేయ్యలని అనిపించింది రోహన్ కి.. కాని ఏదో తన సీనియర్ కి సర్ది చెప్పి అక్కడ నుండి లహరిక ని తప్పించాడు..
                                 ఎందుకో ఆ క్షణం లో లహరిక కూడా మనసులో ఆ గండం నుండి రక్షించాడు అన్నట్లుగా రోహన్ కి థాంక్స్ చెప్పుకుంది.. అలా మొదటి సరిగా రోహన్ మీద + లో ఫీలింగ్ కలిగింది లహరిక కు... అలా ఏదో ఒక సంఘటన లో ఇరువురికి ఒకరంటే ఒకరికి సదభిప్రాయం వారికీ తెలియకుండానే ఏర్పడుతూ వచ్చింది...
                    కాని ఆ అభిప్రాయం అలాగే కొనసాగుతుందా? లేక కాలనుకూలంగా ఏమైనా మార్పు జరుగుతుందా???  నెక్స్ట్ ఎపిసోడ్ కీప్ రీడింగ్.. ప్లీజ్ మీ విలువైన సలహాలు సూచనలు ఈ కథను ముందుకు సాగేందుకు తోడ్పడే విధంగా ఏమైనా ఉంటే అందించగలరని ప్రార్ధన..

మరో హ్యాపీ డేస్ తో ప్రేమ కథ --Episode 4

ఎపిసోడ్ 4 :-

           మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచినట్లు.. అసలు ఆడపిల్లలు అంటేనే నచ్చని వాడు రోహన్ ఒక అమ్మాయి కోసం అలా ఆత్రుతగా వెళ్ళటం చూసి తన ఫ్రెండ్స్ కి ఏదో తేడాగా అనిపించింది.. వాళ్ళు పాపం పిలుస్తున్నాపట్టించుకోకుండా నేరుగా లహరిక దగ్గరకు వెళ్ళాడు.. కాని లహరికకు వచ్చిన అబ్బాయి శివ ఫ్రెండ్ రోహన్ అని తెలియక తన కాలేజీ లో తిరిగే ఒక పొగరుబోతు అబ్బాయి అని భావన లో ఉంది కనుక అతని రాకను చూసి చిరాకు పడింది.. రోహన్ వచ్చి మరీ డైరెక్ట్ గా తనని పరిచయం చేసుకోకుండా ఏదో surprise ఇద్దామనుకుని "మీకో విషయం చెప్పాలని వచ్చాను " అని చెప్పగా , ఏంటని లహరిక అడిగింది.. అప్పుడు రోహన్ " మీరు చాలా అందంగా ఉన్నారు.. యు ఆర్ సొమెథింగ్ స్పెషల్ ఫర్ మీ!!" అని అన్నాడు..లహరిక కి అర్ధం కాలేదు.. వాట్ అని అడిగింది.. ఎస్ ఇట్స్ ట్రూ అని అనేసి అక్కడ నుండి వెళిపోయాడు..ఇక లహరిక ఆలోచనలో పడింది.. వీడేంటి నన్ను స్పెషల్ అనటం ఏంటి పిచి వెధవ ఇదో టైపు అఫ్ రాగ్గింగ్ ఏమో అని అనుకుని అక్కడతో వదిలేసింది..

                                 ఇంకొక రోజు లహరిక తన ఫ్రెండ్స్ తో ఏదో కొత్త గా వచ్చిన మూవీ చూడడానికి వెళ్ళింది.. అక్కడ శివ ఆక్సిడెంట్ కి గురి ఐన శివ ని చూసింది.. శివ కి కలుసుకున్దమనే లోపల తన ఫ్రెండ్ Theater లోపాలకి ఈడ్చుకుపోయింది.. సర్లే మూవీ ఐయ్యాక కలుద్దాం అని లోపలి వెళిపోయింది.. ఆ వెళుతూ ఉండటం శివ తో సినిమా కి వచ్చిన రోహన్ లహరిక తన ఫ్రెండ్ తో రావటం చూసాడు.. శివ తో కనిపిస్తే ఖచితంగా తనని గుర్తు పట్టేస్తుంది అని తెల్సి దూరంగా దాక్కున్నాడు..ఎందుకో కాని రోహన్ కి మనసులో లహరిక అంటే ఒక రకమైన లైకింగ్ ఏర్పడింది.. (అది ఎటు తీసుకెల్లనుందో future లో తనకే తెలిదు పాపం) మూవీ చూస్తూ కూడా లహరిక జాయిన్ ఐన డే నుండి కాలేజీ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకుంటూ ఆ ఆలోచనల్లో తేలుతున్నాడు రోహన్ ... ఇంటర్వెల్ లో శివ కి చెప్పసాగాడు.. తన ప్రాణం కాపాడిన వ్యక్తి ఎవరో కాదు లహరిక ఈ అమ్మాయి ఏ అని చూపించాడు.. శివ కి చాలా ఆనందం వేసింది.. ఆమెకి థాంక్స్ చెప్పాలని వెల్లబోతే రోహన్ అడ్డుకున్నాడు ... ఆ క్షణం ఎందుకలా చేసాడో శిఅవ్ కి అర్ధం కాలేదు రోహన్.. ఎందుకు అని అడగగా.. రూం కి వెళ్ళాక మాట్లాడుకుందాం అని అతడ్ని ఆపేసాడు.. తరువాత ఇద్దరు మూవీ చూసేసి వాళ్ళ రూం కి చేరుకున్నారు..

                        నిద్రపోయే సమయం లో మళ్లీ వారి ఇద్దరి మధ్య లహరిక టాపిక్ రావటం తో రోహన్ మల్లి ఏదో దాచటానికి ప్రయత్నించాడు ఐన శివ అతడిని వదిలి పెట్టలేదు.. (అదేదో అంటారు చూడండి.. మనంతట మనకి తెలియదు మనం ప్రేమ లో పడినట్లు.. కాని మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మనసుని కెలికి గుర్తు చేస్తుంటే అప్పుడు విషయం confusion కి వస్తుంది అది ప్రేమ లేక లైకింగ్ మాత్రమేనా  అని ) అలాగే రోహన్ విషయం లోను జరిగింది.. శివ అడగటం మొదలు పెట్టాడు " అసలు ఆ అమ్మాయి తో ఎందుకు మాట్లాడవద్దు అంటున్నావ్? ఆ అమ్మాయి నీకు ఇంతకూ ముందు పరిచయం ఉందా?" అని.. దాని బదులు గా రోహన్ " ఆ అమ్మాయి మా కాలేజీ లో జూనియర్.. మొదట్లో ఆ అమ్మాయి ని అంతగా పట్టించుకోలేదు.. కాని నీ ఆక్సిడెంట్ తరువాత నాకెందుకో ఆ అమ్మాయి అంటే ఒక స్పెషల్ ఫీలింగ్.. మాటల్లో చెప్పలేను.. " అని చెప్పసాగాడు.. ఐతే శివ అడిగాడు " మరి నేను థాంక్స్ ఎందుకు చెప్పకూడదు" అని..
                                  " నువ్వు థాంక్స్ చెప్పటానికి వెళితే నేనే నీ ఫ్రెండ్ రోహన్ అని ఆమె కి తెలుస్తుంది.. కాలేజీ లో ఆమె సీనియర్ రోహన్ అని తెల్సు.. నా మీద అందరి ఆడ పిల్లలకు ఉండే ఒపెనిఒన్ ఏ ఆమెకి ఉంది.. ఇప్పుడు నీ ఫ్రెండ్ గ తెలిస్తే ఆమె అభిప్రాయం మారొచ్చు.. నాకు అది ఇష్టం లేదు.." అని అన్నాడు..
                అసలు రోహన్ మనసులో ఏమి ఉందొ శివ కి అస్సలు అర్ధం కావటం లేదు.. మళ్లీ అడగసాగాడు.. "అసలేమైంది రా నీకు? ఆ అమ్మాయి ని పోనీ లవ్ చేస్తున్నావా?" అని... దానికి రోహన్ కొంచెం సీరియస్ ఐ
             "లైకింగ్ అన్నాను కాని లవ్ అని చెప్పానా" అని..
             కాని ఆ అమ్మాయి అంటే ఏదో ఫీలింగ్.. ఏదో ఒక different క్యారెక్టర్ మిగతా అమ్మాయిలతో పోలిస్తే కనిపిస్తుంది నాకు అని అన్నాడు..కాని శివ కి మాత్రం అర్ధం ఐంది ఏంటి అంటే వీడు ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్తున్నాడు అని.. అది వాడికి అర్ధం కావటం లేదు అని.. ఇక అక్కడ నుండి మొదలు రోహన్ కాలేజీ కి వెళ్ళటం ఏదో ఒక విషయంగా ఆ అమ్మాయి ని కలవటం ఆమె ని కేలకటం. ఆమెని దొంగచూపులు చూడటం.. రూం కి వచ్చాక శివ తో ముచ్చటించటం ఆ విషయాల గురిండి.. ఇలా రోజులు గడుస్తు ఉన్నాయ్..కాని రోహన్ ఎన్నడూ తన మనసులో ఉన్న విషయం లహరిక దగ్గర ప్రస్తావించలేదు..

                             అనుకోకుండా ఒక రోజు లహరిక తన ఇంటి నుండి కాల్ వచేసరికి వెళ్ళాల్సి వచ్చింది..తన అక్క గురించి ఒక షాక్ న్యూస్.. అదే పెద్ద అక్క.. తన పెద్ద అక్క భర్త ఎంత డబ్బు ఉన్న వాడు ఐనా తను సుఖ పడటం లేదని.. మొదటి భార్య కొడుకుని ఎక్కడ సరిగ్గా చూస్తుందో లేదో అని అసలు పిల్లలనే ఇంకా కనటానికి లేదని కండిషన్ పెట్టాడట పెళ్లి ఐనా మరుసటి రోజే.. కాని లహరిక తల్లితండ్రుల పరిస్థితి కి ఈ విషయం తెలిస్తే ఎం ఐపోతారో అని.. తన భర్త చెప్పిన మాటకు అయిష్టంగా ఒప్పుకుందట.. ఆపరేషన్ కూడా చేయించుకుందట..ఎన్ని ఆభరణాలు ఉన్న పెట్టుకోకూదట ఎందుకంటే తన కి సింపుల్ గా ఉండటం ఇష్టం అట.. ఇలా చాలా కారణాలు.. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాన అని భోరున ఏడుపు.. కాకపోతే పెళ్లి చేసిన బంధువులకు ఈ విషయాలు ముందే తెల్సిన లహరిక తల్లిదండ్రుల దగ్గర దాచి పెట్టి పెళ్లి చేసారట.. ఇది తెల్సి మరింత బాధ పడ్డారు.. ఇంకా ఉన్న భర్తను వదులుకోలేక తన తోనే ఎ బాధలు ఐనా సుఖాలు ఐనా అని చెప్పుకోచింది లహరిక అక్క.. ఇదంతా విని లహరిక తల్లిదండ్రులు బాధ పడటం తప్ప ఏమి చెయ్యలేకపోయారు.. అప్పుడు ఆ పరిస్థితుల్లో లహరిక అక్క లహరికకు చెప్పింది.. "ఎవరు ఎన్ని చెప్పిన నీ లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం ఐనా బాగా అలోచించి నీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తే అదే చెయ్యి.. ఎటువంటి వాటికీ లొంగిపోకు నాలా.. నీ మనసుకి నచని పని ఏది చెయ్యకు.." అని.. అక్కని ఒదార్చోలో లేక అక్క నుండి నేర్చుకోవాలో ఆ క్షణం అర్ధం కాలేదు లహరికకు.. తరువాత లహరిక అక్క తన ఇంటికి వెళిపోయింది.. లహరిక మళ్లీ కాలేజీ హాస్టల్ కి చేరుకుంది..

                            హాస్టల్ లో తన అక్క మాటలు బాగా గుర్తుకు వచ్చాయి.. ఆలోచిస్తూ ఆలోచిస్తూ గట్టి నిర్ణయం కి వచ్చింది.. అక్కలా కాకుండా మంచి గా చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడి తనకు తన తల్లిదండ్రులకు నచ్చిన అబ్బాయి ని పెళ్లి చేసుకుని ఉండాలని అనుకుంది.. అలా ఆమె ఆలోచిస్తూ నిద్ర నుండి లేచేసరికి తెల్లారింది..అక్కడ లహరిక ఆలోచనలు అలా ఉంటే.. లహరిక ఊరు వెళ్ళిన సమయం లో రోహన్ కి విషయం తెలియక పిచ్చేక్కినట్లు ఐంది..తను తప్ప మిగతా అమ్మాయిలతో పరిచయం లేదు రోహన్ కి.. శివ తో మాట్లాడే సమయం లో లహరిక గురిండి చర్చ జరిగింది.. శివ చెప్పడానికి ప్రయత్నించాడు.. నువ్వు ఆ అమ్మాయి ని దీప గా లవ్ చేస్తున్నావు.. కాని అది నీకు అర్ధం కాదం లేదు ఇప్పటికైనా తెల్సుకో అని.. ఇంకా స్లో గ ఆ మార్గం లో ఆలోచన మొదలైంది రోహన్ కి.. ఏమో ఇది లవ్ ఏ నేమో అని.. అదీ కాక శివ ఒక డౌట్ కూడా పెట్టాడు.. అంట చక్కగా అందంగా ఉండే అమ్మాయి ని ఎవరు లవ్ చెయ్యకుండా ఉండరు.. నువ్వు లేట్ చేస్తే ఇంకా ఎప్పటికి ఆ అమ్మాయి కి నీ మనసులో మాట చెప్పలేవు అని.. అలా మనవడికి ప్రేమ మొదలైంది వన్సైడ్ లో..

                            నెక్స్ట్ ఎపిసోడే లో చూద్దాం రోహన్ లవ్ గురిండి లహరిక కు చెప్పగలిగాడ లేక మనసులోనే ఉంచుకున్నదా.. లేక ఇంకెవరు ఐనా లహరిక మనసులో పడ్డారా... అసలు లహరిక మనసు ఖాలిగా ఉందా రోహన్ కోసం.. లేక లవ్ కే ఆమె మనసులో స్థానం లేదేమూ.. వెయిట్ అండ్ సి ఇన్ ఎపిసోడ్ 5

మరో హ్యాపీ డేస్ తో ప్రేమ కథ --Episode 3

ఎపిసోడ్ 3 :-

                             రోహన్ తన ఫ్రెండ్ "శివ" కల్సి ఆరోజు సండే మూవీ చూడ్డానికి వెళ్లారు 2nd షో.. చూసాక కాస్త అలా కరిజ్మ బండి మీద వస్తూ రోడ్ మీద డ్రైవింగ్ తో ఎగురుతూ.. రూం కి చేరుకునేసరికి అర్ధ రాత్రి దాటింది.. ఇద్దరు ఏదో ఉన్నది తిని పడుకున్నారు.. పొద్దున్నే పాపం శివ కి ఏదో జావా కోచింగ్ క్లాస్సేస్ ఉంది అంటే తను హడావుడిగా లేచి రోహన్ కి బాయ్ చెప్పేసి బైలుదేరాడు తన రూం కి..
                            
                             వెళుతూ తన హోండా ఆక్టివ ఆన్ చేసి హెల్మెట్ చేతికి తగిలించుకుని( వెటకారం కదా కొంత మంది అబ్బాయిలు కి హెల్మెట్ తలకి పెట్టుకోకుండా స్టైల్ గా చేతులకి తగిలించుకోడం).. నిద్ర మత్తులో ఏదో డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు.. అలా వెళుతూ తను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో ఊహించలేక పోయాడు.. ఎదురుగా ఒక లారీ డ్రైవర్ రాంగ్ direction లో వచ్చేసి రోడ్ క్రాస్ చెయ్యబోయాడు..అంతే మనోడు Divider ని గుద్ది ఎగిరి అవతల పడ్డాడు.. స్పాట్ లో రోడ్ పక్కన ఉన్న ఒక రాడ్ తన కడుపు లోకి దూసుకుపోయింది..తల మీద హెల్మెట్ లేకపోడం తో తల చిట్లి రక్తం ప్రవహించింది.. ఆ టైం లో లహరిక మార్నింగ్ వాల్క్ కి వెళ్ళసాగింది.. చూడబోతే ఒక మనిషి ఎవరో accident ఐంది.. హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపించింది అప్పుడు...

                                 వెంటనే అక్కడ ఉన్న పోలీసు స్టేషన్ కి కాల్ చేసింది..అమ్బులన్సు క్షణాల్లో వచ్చింది.. ఆ అబ్బాయి శివ మొబైల్ లో ఉన్న రేసెంట్ కాల్ లాగ్ చూసింది.. అందులో లాస్ట్ కాల్ రోహన్ డి ఉంది .. దాని కన్నా ముందు డాడీ అని ఉంది.. వెంటనే 1st రోహన్ నెంబర్ కి డయాల్ చేసింది . రోహన్ హాయిగా తన కలల్లో తేలిపోతూ నిద్రపోతూ ఉన్నాడు తన రూం లో... రాబోయే క్షణం ఎలాంటి వార్త ని అందిస్తో తెలియదు కదా..

                             రోహన్ ని లేవమన్నట్లుగా తన మొబైల్ రింగ్ ఆతు గోల చేసింది.. నిద్ర మత్తులోనే ఎవరా అన్నట్లుగా కాల్ attempt చేసాడు.. అవతలి నుండి ఒక సన్నని స్వరం తో ఒక అమ్మాయి రోహన్ గారేనా అని ప్రశ్నించాసాగింది..అవును!!!!!!! అన్నట్లుగా బడులిచాడు రోహన్ .. వెంటనే అవతలి వ్యక్తి "దయ చేసి ఉన్న పలానా JD Road కి వచ్చెయ్యండి.. మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఇక్కడ accident ఐ పడి ఉన్నారు" అని చెప్పింది.. వెంటనే ఆ మాటకు టక్కున లేచి కూర్చున్నాడు రోహన్.. గుండె టపా టపా కొట్టుకోసాగింది... తన ఫ్రెండ్ అంటే ఎవరు అన్నట్లు గా సందేహం తో నే శివ అన్నట్లుగా అడిగాడు.. అప్పుడు ఆ అమ్మాయి.. "నాకు పేరు తెలిదు..కానీ తన మొబైల్ లో మీ నెంబర్ లాస్ట్ కాల్ అవ్వటం వల్ల మీకు ఇంఫోర్మ్ చేశాను" అని చెప్పింది...ఇంకా ఒక్క క్షణం లేట్ చెయ్యకుండా హుట హుటిన ఆ ప్రదేశానికి చేరుకున్నాడు రోహన్... అప్పటికే చాలా రక్తం పోవటం వల్ల లహరిక, శివ ని హాస్పిటల్ లో చేర్చింది.. రోహన్ ని హాస్పిటల్ కి రమ్మన్నట్లుగా ఇంఫోర్మ్ చేసింది..అప్పటికి శివ కి కూడా మెలుకువ లేకపోడం తో శివ లహరిక ని చూసే అవకాసం లేకపోయింది..
                             ఈలోగా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు హాస్పిటల్ వాళ్ళు చెప్పటం వల్ల.. లహరిక తను చూసింది జరిగిన విషయం పోలీసు వల్ల కి వివరించటం తో మిగతా ఫార్మాలిటీస్ తో వాళ్ళు investigation సాగించారు..ఈలోగా లహరిక ఇంటి నుండి కాల్ రావటం తో అర్జెంటు గ తన ఊరు వెళ్ళాల్సి వచ్చింది.. జస్ట్ ఒక లెటర్ మాత్రం రోహన్ కి రాసి పెట్టి వెళిపోయింది.. లహరిక వెళ్ళిన కాసేపటి లో రోహన్ హాస్పిటల్ కి రాసాగాడు.. శివ కి ఎమర్జెన్సి లో అడ్మిట్ ఐ ఉన్నాడు.. దేవుడు దయ వల్ల లహరిక టైం కి హాస్పిటల్ కి తీసుకురాడం వల్లనో.. ఏదో ఒక విధంగా శివ ప్రాణాలతో బైట పడ్డాడు.. లహరిక కు మనసులో రోహన్ థాంక్స్ చెప్పుకుని నర్స్ ఇచ్చిన లెటర్ ని తీసుకుని చదవసాగాడు.. అందులో " నా పేరు లహరిక మీ ఫ్రెండ్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నాను.. అనుకోకుండా మా ఊరు వెళ్ళాల్సి వచ్చి మిమల్ని కలుసుకోకుండా వెళ్ళిపోతున్నాను.. ఇంకెప్పుడైనా మనం కలుసుకునే అవకాసం వస్తుందేమో చూద్దాం!!" అని ఉంది..

                             రోహన్ మాత్రం తన ప్రాణ మిత్రుడిని సేవ్ చేసిన ఈ లహరిక ను ఎలా ఐన కల్సుకోవాలి అని ఆ క్షణం లోనే నిర్ణయించుకున్నాడు.. వెంటనే పోలీసు వల్ల దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ రాబత్తసగాడు లహరిక గురించి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి అదే సిటీ లో ఉంటుంది.. అందంగానే ఉంటుంది ఇంకా మార్నింగ్ వాల్క్ కి వచ్చింది అంటే తన ఇల్లు కూడా ఇక్కడికే దగ్గరలో ఎక్కడైనా ఉండి ఉండొచ్చు అని ఊహించాడు..సరే మన ప్రయత్నం మనం చేద్దాం అని అక్కడ నుండి శివ పరిస్థితిని వల్ల తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేసాడు..కొద్ది రోజులకు శివ కూడా కోలుకోగా మల్లి ఎవరి పనుల్లో వాళ్ళు ధ్యానం అయిపోయారు.. కాని రోహన్ కి మాత్రం లహరిక ఎవరు ఎలా ఉంటుంది ఎప్పుడు కలుస్తుంది అని ప్రశ్నలు మాత్రం వదిలి పెట్టటం లేదు.. రోహన్ కి చెడు చేసిన వాళ్ళు ఐన మంచి చేసిన వాళ్ళు ఐన అంట త్వరగా మర్చిపోయే అలవాటు లేదు.. సో లహరిక తన ఫ్రెండ్ కి చేసిన హెల్ప్ ని బట్టి చూస్తే ఆమె మనసు మెంటాలిటీ రోహన్ కి ఎక్కడో నచినట్లుగా గుచ్చుతూ ఉండి ..
                             అలా రోజులు గడుస్తుండగా తన కాలేజీ లో ఒక రోజు traditional డే కాంపిటిషన్ పెట్టారు. అందులో దాదాపు అందరు ఏదో ఒక చీర లో అమ్మయిలు వచ్చారు.. కాని ఒక అమ్మాయి లంగా వోని లో కొంచెం డిఫరెంట్ అందం తో కనిపించింది.. నలుపు రంగు ఆని తెల్లటి లంగా లో తెల్లటి మల్లె పువ్వులు తల నిండా అలంకరించుకుని చేతికి గాజులు మునుపు చెప్పిన తెలుగు ఆరుఅణాల ఆడపిల్ల లాగా తాయారు ఐయ్యి కాలేజీ లో చెంగు చెంగున లది పెళ్లిల ఎగురతు ముచతగా కనిపిస్తుంది.. ఆ క్షణం ఎందుకో లహరిక ఇలా ఉండి ఉంటుందా అని అనిపించింది మనసులో రోహన్ కి.. ఏదో గుర్తోచినట్లుగా టక్కుమని మనసు ని divert చేసాడు.. మనసులో "ఇదేంటి నేను ఏంటి అమ్మాయిల వంక చూడటం ఏంటి. నాకు అమ్మయిలు అంటే పడదు కదా?" అన్నట్లుగా ఆ లంగా వోని అమ్మఐ గురింది తెల్సుకోకుండానే అక్కడ నుండి వెళిపోయాడు.. కాని ఆరోజు జరిగిన ప్రైజ్ distribution లో మిస్ లహరిక అని వినిపించింది.. ఆ పేరు వినగానే ఎక్కడో ఆడిటోరియం బైట ఉన్న రోహన్ పరుగెత్తుకుంటూ వచ్చాడు ..
ఎవరి లహరిక అన్నట్లుగా..

                                 లోపలకి రాగానే తను ఎన్ని రోజుల నుండో వెతుకుతున్న అమ్మాయి మరెక్కడో లేదు నా కాలేజీ లో నే ఉందా!! అని షాక్ తిన్నాడు.. ఇక ఏదో దొరికేసింది అన్నట్లుగా తెగ సంబర పడిపోయాడు.. ఇక లహరిక ని వెంటనే కలుసుకుందాం అని 1000 వాట్ట్స్ విద్యుత్ దీపం ల స్పీడ్ గా లహరిక కూర్చున్న చైర్ దగ్గరకు వెళ్ళాడు..


నెక్స్ట్ ఎపిసోడ్ లో మల్లి కల్సుకుందాం.. కీప్ రీడింగ్..

మరో హ్యాపీ డేస్ తో ప్రేమ కథ --Episode 2

ఎపిసోడ్ 2:

========

అందరిలాగే తను కూడా ఏదో చదివేయ్యాలి, ఇంజనీరింగ్ లో ఐతే జాబు ఈజీ గా తెచ్చేసుకుని అమ్మ వాళ్ళని కాస్త సుఖ పెట్టొచ్చు అనుకుందో ఏమో .. మొత్తానికి కాలేజీ లో అడుగు పెట్టేసింది .. కాలేజీ అంటే తెల్సిందే కదా ఫ్రెషర్స్ వస్తున్నారు అంటే సీనియర్స్ కి భలే క్రేజి... ఎలా వాళ్ళని ఏడిపించి ఎలా వాళ్ళని ఆడుకుని నవ్వుకున్దామా.. (అలా అని వాళ్ళు రాగ్గింగ్ చేసి ఫ్రెషర్స్ ని బాధ పెడుతున్నారు అని అనుకోకండి. వాళ్ళే చివరికి బెస్ట్ ఫ్రండ్స్ గా మిగులుతారు మరి!!!)

                                                కాలేజీలో అడుగు పెడుతూనే భయం భయంగా మనసులో ఉన్నా, లహరిక మాత్రం బైటకు చాలా గంభిరాన్ని ప్రదర్శిస్తూ ముందుకు నడవసాగింది .పాపం పల్లెటూరు కదా కొంచెం ఏంటి ఎక్కువగానే కోత్హ వాతావరణం ఆమెకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంది....అలా తన ఆలోచనల్లో తను తేలుతూనే ఒక సీనియర్ గ్యాంగ్ కి చిక్కిపోయింది .. ఇంకా కళ్ళనీళ్ళు ఒక్కటే తక్కువ.. ఐనా సరే భయ పడను అని మనసులో అనుకుంటూ వాళ్ల దగ్గరకి వెళ్ళింది... అందులో ఒకడు ఒకడు హీరో హోండా కరిజ్మ బండి మీద కూర్చుని గుడ్లు అప్పగించుకుంటూ లహరికను మింగేసేలా చూస్తున్నాడు. ..


                                                ఇంకా గ్యాంగ్ రాగ్గింగ్ మొదలైంది.. పేరేంటి అని అడిగారు.."లా..హా..రి..కా " అని లోపలి స్వరం మెల్లగా విప్పింది..గొంతులో వణుకు తెలుస్తూనే ఉంది .. ఆ బండి మీద కూర్చుని ఉన్నవాడు చూస్తూనే ఉన్నాడు .. ఇంకొకడు వినిపించలేదు అన్నట్లుగా గట్టిగా చెప్పు అని expressions పెడుతూ అడిగాడు...ఈసారి మరి కొంచెం పెద్ద స్వరంతో చెప్పింది. .. ఏ ఊరు ఏ వాడ అని చెత్త ప్రశ్నలు అన్ని వేసారు.. ఆ బండి మీద ఉన్నా వాడు మాత్రం చూడడం తప్ప వేరే పని లేదు. . మనసులో తిట్ల వర్షం కురిపించసాగింది.. ఆ గ్యాంగ్ మొత్తం మీద... పైకి చిరు నవ్వు చూపిస్తూ. ..

                                                ఏదో అలా రాగ్గింగ్ చేస్తున్నారే కాని అక్కడున్న గ్యాంగ్ కి కూడా ఆ అమ్మాయి మీద ఏదో ఒక స్పెషల్ impression పడింది మొదటి చూపులోనే ... అలా ఒక 15mins లో అక్కడ నుండి బైట పడింది మన "లహరిక "..అలా క్లాసు రూం లోకి వెళ్ళింది అక్కడ తనలాగే చాలామంది అమ్మైలు ఉన్నారని అక్కడికేల్లక తెల్సింది .. రాగ్గింగ్ అనేది ఒక కామన్ విషయంగా అక్కడ అమ్మాయిలు చెప్పుకొస్తున్నారు .. వాళ్ళతో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చెప్పుకోచారు...(ఇదేదో హ్యాపీ డేస్ సినిమా అనుకోకండీ...ఏ కాలేజీ లో ఐనా జరిగే విషయాలు ఇవే కదా!! )..అలా కాలేజీ లో మొదటి రోజు గడిచిపోయింది ..
                                                హాస్టల్ కి తిరుగు ప్రయాణం మొదలెట్టిన లహరికకు మళ్లీ భయం మొదలు. ఎందుకంటే కాలేజీ బస్సు లో సీనియర్స్ ఉంటారు కనుక ..ఈసారి తనకు ఒక లేడీ సీనియర్ గ్యాంగ్ తగిలింది.. అందులో ఒక బండది పాపం వాళ్ల హాస్టల్లో నే ఉంటుంది .. అది సిగార్ ఎలా కాలుస్తావో చూపించమంది.. పాపం లహరిక " నాకు అలంటి అలవాట్లు లేవండి" అని చెప్పగా ఆ బండదానికి తెగ కోపం వచేసి "నువ్వు అనేది ఏంటి మాకందరికీ సిగార్ కాల్చే అలవాటు ఉందనా?" అని లహరిక మీద విరుచుకు పది గోల గోల చేసింది...తప్పదు అన్నట్లుగా అలాగే వాళ్ళు చెప్పినవన్నీ చేస్తుండగానే హాస్టల్ వచేసింది...

                                                హాస్టల్ కి వెళ్ళాక లహరిక అలా తన ఇంటి పరిస్థితులని గుర్తు చేసుకుంది...తన అక్కల పరిస్థితి తనకు రాకుండా ఉండాలంటే బాగా చదివేసి తొందరగా ఉద్యోగం తెచ్చేసుకుని వెల్ సెటిల్ అయిపోవాలని ..(అనుకున్నవన్నీ ఐపోతాయా.. ఏదో వయసులో ఉన్నవాళ్లు అలా కలలు కనేస్తూ ఉంటారు..) అలా తన ఇంటి ఆలోచనలు నుండి టక్కున ఇంకో ఆలోచన మీదకి మళ్ళింది లహరిక మనసు.. ఏంటి అంటే ఆ హీరో హోండా బండి మీద కూర్చున్న వ్యక్తి గుర్తొచ్చాడు..చూడ్డానికి వాడు 6 అడుగుల ఎత్తు.. కొంచెం నొర్మల్ కలర్.. (లహరిక అంత లేకున్నా!).. చూడడానికి బాగానే ఉంటాడు... కాకపోతే వాడి పొగరు వాడి మొహం లో నే తెల్సిపోతుంది... బాగా బలసి ఉన్నవాడని..ఏ మనిషికి ఐనా ఫస్ట్ పరిచయంలో అంటే ఆ మనిషిని చూడగానే either గుడ్ or బేడ్ ఒక impression పడుతుంది కదా!.. అలాగే మన లహరికకి కూడా ఒక బేడ్ impression పడింది ఆ అబ్బాయి మీద.. ఆనన్నట్టు.. చెప్పటం మర్చిపోయాను .. వాడే మన కథ కి హీరో...పేరు "రోహన్".


                                                రోహన్ మీద లహరిక కి పడిన impression అలా పక్కన పెడితే, రోహన్ కి నిజంగానే బాగా పొగరు.. కొంచెం వాళ్ల అమ్మ నాన్న సంపాదించినా ఆస్తితో బలుపు కూడా.. సో అతనికి పేదవాళ్ళు అంటే ఒక రకమైన చిన్నచూపు . ఆడ పిల్లల్ని చాల రఫ్ గా హేండిల్ చేసే రకం.. వాడి ప్లుస్ పాయింట్ ఏంటి అంటే చదువులో 1st.. అందలో కూడా ఉన్నాడనుకోండి వాళ్ల క్లాసు వరకు ..కొంత మంది అమ్మాయిలు వాడి డిఫరెంట్ మెంటాలిటీ ని ఇష్టపడి వాడిని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు.. కాని రోహన్ కి మాత్రం అందరు ఆడ పిల్లలే...అందరికి నచేది వాడికి నచ్చదు.. వాడు చేసేది జనాలకు మొదట్లో నచ్చకపోయినా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాడు అనే ఫీలింగ్.. సరే రోహన్ గురించి డబ్బా ఒక పక్కన పెడితే . రోహన్ vs లహరిక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూద్దాం..కీప్ వెయిటింగ్..

మరో హ్యాపీ డేస్ తో ప్రేమ కథ --Episode 1

టైటిల్ ఏమి పెట్టాలో కూడా నాకు తెలియలేదు.. డిఫరెంట్ హ్యాపీ డేస్ గా ఊహించుకోండి.. ఏదో అలా రాయాలనిపించి అలా మొదలైంది "లహరిక" లవ్ స్టోరీ .. నచ్చితే మంచిదే కానీ నచ్చకపోయినా లేక మీరు ప్రేమ కథలకు విరుద్ధం ఐనా దయ చేసి నన్ను తిట్టుకోకండి .. ఈ కథ మొత్తం కల్పితమే.. ఎవరిని ఉద్దేశించి కాదు.. నౌ లెట్స్ ఎంటర్ ఇంటు ది ఎపిసోడ్ నెంబర్ 1.....

ఎపిసోడ్ 1:-

అనగనగా ఒక అందమైన పల్లెటూరు.. పచ్చని పొలాలు.. పొలాల మధ్య పొద్దుతిరుగుడు పువ్వుల తోటలు..ఆ పక్కనే చెరుకు తోట . మధ్యలో సన్నగా ఒక ఒక ఏరు.. పక్కనే ఇసుక.. ఇసుకలో తేటగా ఏరు నీరు. .. చూసేందుకు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం .. ఆ ప్రదేశానికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు పేరు "సీతంపేట". అందులో ఒక చిన్న ముచ్చటైన మధ్య తరగతి కుటుంబం నివసించే ఒక పెంకుటిల్లు.

                                      ఆ కుటుంబం లో ఒక 16 అణాల తెలుగు ఆడ పడుచు పేరు "లహరిక ", తనకు మరో ఇద్దరు అక్కలు. లహరిక అమ్మ ఇంటి పట్టునే ఉంటుంది ఇల్లాలి గా, నాన్న వ్యవసాయం. కొడుకు కోసం ఎదురు చూసి ముగ్గురు ఆడపిల్లని కనేసాడు పాపం...ఐనా దేవుడు కరుణించలేదు ..తనకి వచినంత ఆదాయంతో ఉన్న ఎకరా పొలం లో తన ముగ్గురి ఆడపిల్లల్ని పెంచి పోషిస్తూ జీవితాన్ని అలా నెట్టుకొస్తున్నాడు ..

                                      ఇదేదో కష్టాల్లో కూరుకుపోయిన దారిద్ర జీవితం నెట్టుకొస్తున్న ఒకటో తారీకు సినిమా అని ఎక్స్పెక్ట్ చెయ్యకండి.. దయచేసి కొంచెం ఓపిక తో ఉండండి ..

                                      లహరిక చిన్న వయసులో ఉండగానే, తన బంధువులు లహరిక అమ్మ నాన్నని భయ పెట్టారు "ముగ్గురు ఆడ పిల్లల్ని కనేసావు.. వయసు వచ్చిన ఆడ పిల్లలకు పెళ్లి టైం కి చెయ్యకపోతే ముదిరిపోయాక సంబంధాలు రావటం కష్టం అని ", అందువల్ల లహరిక పెద్ద అక్క ఐన "కీర్తి" కి తన బంధువులలో ధనవంతులైన ఒకరు ఒక మంచి సంబంధం తీసుకువచ్చారు. పాపం కీర్తికి తన పరిస్థితులను అర్ధం చేసుకుని, ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది .. తను చేసుకోబోయే అబ్బాయి USA lo పెద్ద ధనవంతుడు,కాకపోతే అతనికి పెళ్లి ఐంది ఒక బాబు కూడా ఉన్నాడు ౫ సంవత్సరాలు. అతని మొదటి భార్య యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల బిడ్డ కోసం రెండో పెళ్ళికి రెడీ ఐయ్యాడు .. కాకపోతే అక్కడే చేసింది కీర్తి చెయ్యరని తప్పు తను తీసుకున్న నిర్ణయం లో .. పాపం తనకేం తెల్సు ఒక ఊబి లో చిక్కుకోబోతుంది అని .. సరే ఎలాగోలా ఫ్రీ గా చేసుకుంటామని వచ్చిన ఆ పెళ్లి కొడుకు కే కీర్తి ని ఇచ్చి పెళ్లి చేసేసి హాయిగా ఫీల్ ఐయ్యారు వల్ల అమ్మ నాన్న ..(కాని ఒక 5 సంవత్సరాల తేడా తోనే కీర్తి జీవితం మారిపోయింది.. దాని జీవితం నాశనం చేసామని అప్పటికి కానీ వల్ల తల్లితండ్రులకి అర్ధం కాలేదు.. ఆ విషయాన్నీ తరువాత మనం చర్చిద్దాం..)

                                      నెక్స్ట్ ఉన్న బంధువులు అక్కడితో ఊరుకుంటారా నెక్స్ట్ లహరిక రెండో అక్క "భాను" మీద పడ్డారు పెళ్లి పెళ్లి అని.. మళ్లీ అదే గొడవ . అందుకని లహరిక అమ్మ నాన్న తన మేన మామ ఐన "వెంకట్" కి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధ పడ్డారు .. వెంకట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ..అందగాడు .. కాకపోతే అన్ని భగవంతుడు ఇచ్చేయ్యడు కదా .. ఒకే ఒక లోపం .. పాపం ఉద్యోగం వచ్చిన 6 నెలలకే అతనికి యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి ..అంటే బాగా చెప్పాలంటే అవిటివాడు ..చివరికి భాను కూడా బలైంది.. పెళ్లి చేసేసారు ..ఆమె ఏదో తను చదివినంత లో ఒక ప్రైవేటు కాలేజీ లో లెక్చరర్ గా ఉద్యోగం చేసుకుంటూ తన లైఫ్ ని గడుపుతూ ఉంది .. హావే ఎ బ్రేక్ ఫర్ ఫ్యామిలీ నౌ .. లెట్స్ కం టు ద హీరోయిన్ "లహరిక"


                                      లహరిక తన 16 వ సంవత్సరం కి వచ్చేసింది ..ఆమె అందంగా ఆణి ముత్యంలా ఉంటుంది .. (కాకపోతే సినిమాలలో చూపించేతంట మకప్ లేదు అనుకోండి ..) చక్కని పొడుగాటి కురులు ..చారడేసి కళ్ళు అంటారే అంతకు తగ్గట్లుగా ఛాయా.. శరీర సౌష్టవం .. చూడగానే ఏ కుర్రాడికైన "నాకు ఇలాంటి భార్య కావాలి" అని అనిపించేలా ఉంటుంది.. పుట్టింది మధ్య తరగతి కుటుంబం లో ఐన ఏ కష్టాలు లేని లేడి పిల్లలా కనిపిస్తుంది .. ఎప్పుడు తన ముఖం మీద చిరు నవ్వుని వీడనివ్వదు.. అమ్మకి ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ తన చదువు సాగిస్తూ ఉంది .. తను ఉన్న పరిస్థితులకి గవర్నమెంట్ కాలేజీ చదువు కి ఏదో అలా EAMCET లో ర్యాంక్ కొట్టేసింది .. అలా ఆ అమ్మాయి ఇంజనీరింగ్ లో జాయిన్ ఐంది .. అక్కడే వచ్చింది ఒక పెద్ద ట్విస్ట్ ..అదేంటో నెక్స్ట్ ఎపిసోడే లో చూడండి..

Thursday, November 10, 2011

Proud to be an Indian

ఈరోజు ఒక చిన్న ఇంసిడెంట్ జరిగింది .. ఆఫీసు కి వస్తు ఉన్నప్పుడు రోడ్ పక్కన మన భారత దేశం జెండా ఒకటి దొర్లుతూ కనపడింది... వర్షం వల్ల అది బాగా మురికి పట్టి పోయింది.. ఆ రోడ్ మీద చాల మంది నడుస్తూ వెళుతున్న ఆ జెండా ని చూసే వాళ్ళు కాని పట్టించుకునే వాళ్ళు కాని లేరు..అల దొర్లుతూ ఉంది రోడ్ పక్కన.. కాని ఒక మనిషి చాల బరువు ని మోస్తూ కూడా తన చూపు ఆ జెండా మీద పడింది ఎం అనుకున్నాడో ఏమో కాని ఆ జెండా ని తీసుకుని వాటర్ లో వాష్ చేసి తనతో తీసుకుని వెళ్ళాడు...చాల హ్యాపీ గ అనిపించింది నాకు.. ఇంట బిజీ లైఫ్ లో కూడా వేలల్లో ఒక మనిషి ఐన ఉన్నాడు జెండా కి విలువ, గౌరవం ఇచ్చేవాడు.. చాలా గర్వం గా కూడా అనిపించింది నాకు.. ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్
Today one small incident happened.. while coming office i saw one Indian Flag is on the road side.. it became dirty because of rain.. no one is caring about that even though many people walking on the same road.. but one person who is carrying a heavy load took that flag along with him and washed it with water and carried along with him.. i felt very happy & proud of it.. because still people are there among thousands of people who gives respect to our nation in their busy life.. Proud to be an Indian..

ఆంధ్ర vs తెలంగాణా

ఈ మధ్య చాలా బ్లాగ్స్ లో తెలంగాణా విషయం ఐ చదువుకున్న వాళ్ళు కూడా నిరక్షరాస్యుల లాగే పోట్లడుకోవటం కనిపించింది నాకు.. టీవీ చానల్స్ లో మాత్రమే ఈ విషయం ఐ రభస అనుకున్నాను.. కాని ఇలా బ్లాగ్స్ లో కూడా అసబ్యాకరమైన పదజాలం వాడుతూ ఆంధ్ర  vs తెలంగాణా కోసం పోట్లాడుకుంటున్నారు.. వాళ్ళందరికీ ఒక విన్నపం.. నిజంగా తెలంగాణా వస్తే కావాలి అనుకునేవాళ్ళకు చాల ఆనందంగా ఉంటుంది.. కాని ఇలా ఒకరినొకరు తిట్టుకోడం వల్ల చూసేవాళ్ళకి ఎగతాళి గా ఉంటుంది తప్ప ఎవరికీ వచ్చే లాభం ఏమి లేదు గా.. అన్న హజారే గారి నే చూడండి.. అతను ఎంత శాంతియుతంగా పోరాడుతున్నారో.. నిజంగా అతను తీసుకున్న మార్గం సరి ఐనది ఎవరిని ఇబ్బంది పెట్టటం లేదు కనుకనే ప్రపంచం మూలల నుండి అతనికి support వచ్చింది..అన్డుచ్చేత ప్రత్యేక తెలంగాణా లేక సమైక్య ఆంధ్ర ఏదైనా సరే మీ వ్యాఖ్యలు ఎవరిని కించపరచకుండా మీ ఉద్యమం కొనసాగించాలని ప్రార్ధన .. నా ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు..  

Wednesday, November 9, 2011

Google AdSense

"Google AdSense "  గురించి ఎంత వరకు ఇది నిజమో ఎవరైనా వివరాలు అందించగలరా..!!