Sunday, November 13, 2011

నేటి తరం యువతీ/యువకుల పెళ్ళికి సంబంధించి సమస్యలు

ఈ మధ్య కాలం లో నేను గమనిచించిన అంశాలు.. ఇవి నా చుట్టూ జరిగిన అంశాలు మాత్రమే ఎవరినైనా కించపరిచేట్లుగా ఉంటే క్షమించగలరని ప్రార్ధన..
అ) అబ్బాయిలు :-


* అబ్బాయిలు మునుపటి కాలం తో పోల్చి చూస్తే చాల వరకు తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి చాల వరకు ఆప్షన్స్ తగ్గించుకున్నారు. ఉదాహరణకు ఒక అమ్మాయి చదువుకుని ఉంటే ఏదైనా ఉద్యోగం లో స్థిరపడి ఉంటే ఇద్దరి సంపాదనతో కుటుంబం ఇద్దరి చేతులు మీదుగా నడపవాచు అని కొందరు అంటే కట్నానికి పెద్ద గా  importance  ఇవ్వకుండా (ఒక వేల అమ్మాయి తల్లితండ్రులు ఇష్టం మేరకు ఎంత ఇస్తే అంట తీసుకోడానికి సిద్దం అని అంతే కాని ఇంత కావాలి అని డిమాండ్ చెయ్యకుండా ). ఇక్కడ అమ్మాయి అందానికి పెద్ద ప్రేఫరేన్సు ఇవ్వరు ఏదో అవెరగె గా ఉన్న చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు


* ఒక వేళ అమ్మాయి అందంగా ఉంటే కట్న కానుకులు ను కూడా ఆశించని వాళ్ళు ఉన్నారు


* ఇక అమ్మాయి ఎం జాబు చెయ్యకున్న ఎంతో కొంత చదువుకుని ఉండాలి సో దట్ తన పిల్లల వరకు ఐన తను చదివిన్చుకునేంత.. అలంటి అమ్మాయి విషయం లో అబ్బాయిలు ఎంతో కొంత కట్నం ఇంత కావాలి అని ఆశిస్తున్నారు


*ఇక అమ్మాయి కి అబ్బాయి కి నచ్చింది అంటే చాలా మటుకు తన వేపు నుండి సర్దుకుపోయే తత్వానికి మొగ్గు చూపుతున్నాడు అంటే రంగు, పొడుగు, లావు ఇలా చాలా విషయాల్లో పర్వాలేదు లే అన్నట్లుగా..
*పాత కాలం లో అంటే మా నాన్న గారి కాలం లో అమ్మాయి కి మాత్రమే ఫోటో తీసినప్పుడు ఫోటోగ్రాఫర్ ఇలా ఉండు అలా పోస్ ఇవ్వు అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ తిప్పలు అబ్బాయి లకు వచ్చాయి అనిపిస్తుంది
ఈ మధ్య అబ్బాయి లకు కూడా పెళ్లి చూపులకు ప్రత్యేకంగా ఫోటో  ఫోటోగ్రాఫర్ తో తీసుకోవాల్సి వస్తుంది
*కొన్ని సంఘటనలు ఇలా కూడా ఉన్నాయి అబ్బాయి ఎంత చదువుకున్న వాడు ఐనా అవతలి అమ్మాయి ఎంత చదువుకున్నది ఐనా జీవితం లో తనకాళ్ళ మీద తను నిలబడగలిగినా కట్నం విషయం లో మాత్రం లేదా కానుకల విషయం లో ఐనా అస్సలు తగ్గటం లేదు ముక్యంగా అగ్రకులాల్లో ఇది ముఖ్యంగా కనిపిస్తుంది ఉదాహరణకు కట్నం వద్దు అని చెప్పిన ఈ మధ్య బంగారం ధర పెరిగింది కదా సో ఎక్కువ బంగారం అడుగుతున్నారు అదేదో పిల్ల తల్లిదండ్రులు పందిస్తున్నట్లు ....ఈ విషయం లో మాత్రం చాల మార్పు అవసరం..
బ) అమ్మాయిలు
ఇక అమ్మాయి లకు సంబంధించి ఐతే కాస్త ఎక్కువ ఒప్షన్స్ పెంచారు అనిపిస్తుంది.భారత దేశం లో కొడుకు కి ఇచ్చే విలువ పుణ్యమా అని అమ్మాయిలు సంఖ్య రాను రాను తగ్గుతూ వచ్చింది.. దాంతో అమ్మాయి ల డిమాండ్ పెరిగిపోతు ఉంది. అవుట్ అఫ్ 1000 అబ్బాయిలకు  సుమారు గా 900 మాత్రమే అమ్మాయి లు ఉంటున్నారు.. అలాగే చదువుకుని ఉద్యోగం లో స్థిర పడ్డాక పెళ్లి చేసుకుందాం అనుకునే అమ్మాయి లు పెరిగారు.. అలాగే అమ్మాయి ఉద్యోగం లో స్థిరపడితే కట్నం సమస్య ఉండదు అనుకునే తల్లిదండ్రులు కూడా పెరిగారు.. అంటే భారత దేశం ఈ విషయం లో అభివ్రుది చెందింది అనే చెప్పుకోవాలి అనుకోండి.. కాని అబ్బాయి లకే కష్టాలు మొదలుతున్నాయి ఎలా అంటారా ఇలా ఈ దిగువన పాయింట్స్ చదవండి
* అమ్మాయి ఎలా ఎంత అందంగా ఉన్నది అనవసరం తనకు మాత్రం అందమైన మొగుడు రావాలి  అనుకుంటుంది.. అందుకనే ఎన్ని పెళ్లి సంబంధాలు ఐనా తిరస్కరిస్తూ ఉన్నారు ఈనాటి అమ్మాయి లు వాళ్ళకి నచ్చిన అబ్బాయి దొరికే దాక అంతే కాని తల్లిదండ్రులు బలవంతానికి లోన్గిపోడం లేదు
* తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కి ముందు వెనక ఆస్తి తో పాటు పెళ్లి ఐయ్యక తన ఇష్టాలు కి ఎంత వరకు ప్రాముక్యత ఇస్తాడో ముందు సరి టెస్టింగ్ కూడా చేస్తున్నారు అంటే పెళ్ళికి ముందే కొంత వ్యవధి లో అతని మనస్తత్వం ని చదవటం లో
* ఉద్యోగమ పురుష లక్షణం కాని అబ్బాయి కి ఉద్యోగం ఒక్కటే ఉంటే సరిపోదు ఆమె నచ్చిన ఫీల్డ్ లో మాత్రమే ఉండాలి..జీతానికి కూడా ఒక రేంజ్ పెడుతున్నారు..
*ఒక వేళ ఇంట్లో అమ్మ నాన్న బలవంతానికి పెళ్లి కి ఒప్పుకున్నా తీర పెళ్లి రోజులు దగ్గర పడే సమయానికి వేరే అబ్బాయి ని ప్రేమించ అంటూ వేలిపోతున్నారు..( అంటే అందరు అమ్మాయి లు ఇలాంటి వాళ్ళని నా ఉద్దేశం కాదు నేను చూసిన చాల సంఘటనలు ఉన్నాయి ) పాపం ఆ పెళ్లి చేసుకోవాలన్న అబ్బాయి ఎం తప్పు చేసాడు చివరి నిమిషం లో అతని పరువుతీయటం ఎంత బాధ పెడుతుంది అతని ని అతని ఫ్యామిలీ ని
*కొంత మంది అమ్మాయి లు ఐతే ఉద్యోగం అబ్బాయి కి ఉన్నా S/W  లో ఆ అబ్బాయి ఒక్కసారి ఐనా ఆన్  సైట్ కి వెల్లడ లేదా అని అడుగుతున్నారు.. వెళ్ళాక పోతే అతను పనికిరానివాడి గా జమకడుతున్నారు

*కాని అది ప్రేమ వివాహం ఐన లేదా పెద్దలు కూర్చిన పెళ్లి ఐన పెళ్లి అయిన రెండు మూడు సంవత్సరాలు వరకు ఇద్దరి మధ్య కీచులాట మాత్రం తప్పటం లేదు.. వాటిని అధిగమించి ఓర్పు తో ఉన్నవాళ్లు ఆ బంధాన్ని ముందుకు నడుపుతున్నారు.. అలా కానప్పుడు ఎవరికి వారె అన్నట్లుగా విడాకులకు సిద్ధపడుతున్నారు..ఒకప్పుడు ఇచ్చిన విలువ ఆ బంధానికి నేటి సమాజం ఇవ్వటం లేదు అని అనిపిస్తుంది ఒక్కోసారి..     
చెప్పుకుంటూ పోతే ఇలా చాలా కనిపిస్తాయి అనుకోండి.. మీకు కూడా ఇలాంటి సంగటనలు ఎదురు పడవచ్చేమూ..keep smiling don't take the above points as serious

8 comments:

  1. Hi

    Nice Post.

    Can you please see the following link.

    http://endukoemo.blogspot.com/2011/11/blog-post_07.html

    what's your Valuable comment on this???

    Just Curiosity.

    please Reply

    thanks

    ?!

    ReplyDelete
  2. మీ పరిశీలన బాగుంది కాని, గులాబి రంగు ఫాంటు(Font)చదివేదానికి చాలా ఇబ్బందిగా ఉంది.

    ReplyDelete
  3. తమ్ముడూ రాజేష్ మారం... అంటే అమ్మాయి లు ఈ బ్లాగ్ చదవొచ్చు కదా ..వారిని నేను ఇబ్బంది పెట్టె విధంగా ఉండకూడదు.. so no debate on this..ఇవి నేను చూసిన సంగటనలు మాత్రమే నేను చూడనివి అబ్బాయి/అమ్మాయి ల గురింది ఎన్ని ఉన్నాయో తెలిదు కదా..

    ReplyDelete
  4. వసంతం గారు ఫాంట్ మార్చానండి..

    ReplyDelete
  5. నేను నా వ్యాఖ్యను ఉపసంహరించుకున్నాను...

    ReplyDelete
  6. మీ పరిశీలన బాగుంది! agree to some extent!

    ReplyDelete
  7. పెళ్ళి చేసుకోవడంలోనే కాదండీ.. ప్రేమ విషయాల్లోనూ వేచిచూసే ధోరణి బాగా పెరిగింది అమ్మాయిలలో..! ఈ ధోరణి కొంతమందికి నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు..

    ReplyDelete