Friday, November 11, 2011

మరో హ్యాపీ డేస్ తో ప్రేమ కథ --Episode 1

టైటిల్ ఏమి పెట్టాలో కూడా నాకు తెలియలేదు.. డిఫరెంట్ హ్యాపీ డేస్ గా ఊహించుకోండి.. ఏదో అలా రాయాలనిపించి అలా మొదలైంది "లహరిక" లవ్ స్టోరీ .. నచ్చితే మంచిదే కానీ నచ్చకపోయినా లేక మీరు ప్రేమ కథలకు విరుద్ధం ఐనా దయ చేసి నన్ను తిట్టుకోకండి .. ఈ కథ మొత్తం కల్పితమే.. ఎవరిని ఉద్దేశించి కాదు.. నౌ లెట్స్ ఎంటర్ ఇంటు ది ఎపిసోడ్ నెంబర్ 1.....

ఎపిసోడ్ 1:-

అనగనగా ఒక అందమైన పల్లెటూరు.. పచ్చని పొలాలు.. పొలాల మధ్య పొద్దుతిరుగుడు పువ్వుల తోటలు..ఆ పక్కనే చెరుకు తోట . మధ్యలో సన్నగా ఒక ఒక ఏరు.. పక్కనే ఇసుక.. ఇసుకలో తేటగా ఏరు నీరు. .. చూసేందుకు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం .. ఆ ప్రదేశానికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు పేరు "సీతంపేట". అందులో ఒక చిన్న ముచ్చటైన మధ్య తరగతి కుటుంబం నివసించే ఒక పెంకుటిల్లు.

                                      ఆ కుటుంబం లో ఒక 16 అణాల తెలుగు ఆడ పడుచు పేరు "లహరిక ", తనకు మరో ఇద్దరు అక్కలు. లహరిక అమ్మ ఇంటి పట్టునే ఉంటుంది ఇల్లాలి గా, నాన్న వ్యవసాయం. కొడుకు కోసం ఎదురు చూసి ముగ్గురు ఆడపిల్లని కనేసాడు పాపం...ఐనా దేవుడు కరుణించలేదు ..తనకి వచినంత ఆదాయంతో ఉన్న ఎకరా పొలం లో తన ముగ్గురి ఆడపిల్లల్ని పెంచి పోషిస్తూ జీవితాన్ని అలా నెట్టుకొస్తున్నాడు ..

                                      ఇదేదో కష్టాల్లో కూరుకుపోయిన దారిద్ర జీవితం నెట్టుకొస్తున్న ఒకటో తారీకు సినిమా అని ఎక్స్పెక్ట్ చెయ్యకండి.. దయచేసి కొంచెం ఓపిక తో ఉండండి ..

                                      లహరిక చిన్న వయసులో ఉండగానే, తన బంధువులు లహరిక అమ్మ నాన్నని భయ పెట్టారు "ముగ్గురు ఆడ పిల్లల్ని కనేసావు.. వయసు వచ్చిన ఆడ పిల్లలకు పెళ్లి టైం కి చెయ్యకపోతే ముదిరిపోయాక సంబంధాలు రావటం కష్టం అని ", అందువల్ల లహరిక పెద్ద అక్క ఐన "కీర్తి" కి తన బంధువులలో ధనవంతులైన ఒకరు ఒక మంచి సంబంధం తీసుకువచ్చారు. పాపం కీర్తికి తన పరిస్థితులను అర్ధం చేసుకుని, ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది .. తను చేసుకోబోయే అబ్బాయి USA lo పెద్ద ధనవంతుడు,కాకపోతే అతనికి పెళ్లి ఐంది ఒక బాబు కూడా ఉన్నాడు ౫ సంవత్సరాలు. అతని మొదటి భార్య యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల బిడ్డ కోసం రెండో పెళ్ళికి రెడీ ఐయ్యాడు .. కాకపోతే అక్కడే చేసింది కీర్తి చెయ్యరని తప్పు తను తీసుకున్న నిర్ణయం లో .. పాపం తనకేం తెల్సు ఒక ఊబి లో చిక్కుకోబోతుంది అని .. సరే ఎలాగోలా ఫ్రీ గా చేసుకుంటామని వచ్చిన ఆ పెళ్లి కొడుకు కే కీర్తి ని ఇచ్చి పెళ్లి చేసేసి హాయిగా ఫీల్ ఐయ్యారు వల్ల అమ్మ నాన్న ..(కాని ఒక 5 సంవత్సరాల తేడా తోనే కీర్తి జీవితం మారిపోయింది.. దాని జీవితం నాశనం చేసామని అప్పటికి కానీ వల్ల తల్లితండ్రులకి అర్ధం కాలేదు.. ఆ విషయాన్నీ తరువాత మనం చర్చిద్దాం..)

                                      నెక్స్ట్ ఉన్న బంధువులు అక్కడితో ఊరుకుంటారా నెక్స్ట్ లహరిక రెండో అక్క "భాను" మీద పడ్డారు పెళ్లి పెళ్లి అని.. మళ్లీ అదే గొడవ . అందుకని లహరిక అమ్మ నాన్న తన మేన మామ ఐన "వెంకట్" కి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధ పడ్డారు .. వెంకట్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ..అందగాడు .. కాకపోతే అన్ని భగవంతుడు ఇచ్చేయ్యడు కదా .. ఒకే ఒక లోపం .. పాపం ఉద్యోగం వచ్చిన 6 నెలలకే అతనికి యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి ..అంటే బాగా చెప్పాలంటే అవిటివాడు ..చివరికి భాను కూడా బలైంది.. పెళ్లి చేసేసారు ..ఆమె ఏదో తను చదివినంత లో ఒక ప్రైవేటు కాలేజీ లో లెక్చరర్ గా ఉద్యోగం చేసుకుంటూ తన లైఫ్ ని గడుపుతూ ఉంది .. హావే ఎ బ్రేక్ ఫర్ ఫ్యామిలీ నౌ .. లెట్స్ కం టు ద హీరోయిన్ "లహరిక"


                                      లహరిక తన 16 వ సంవత్సరం కి వచ్చేసింది ..ఆమె అందంగా ఆణి ముత్యంలా ఉంటుంది .. (కాకపోతే సినిమాలలో చూపించేతంట మకప్ లేదు అనుకోండి ..) చక్కని పొడుగాటి కురులు ..చారడేసి కళ్ళు అంటారే అంతకు తగ్గట్లుగా ఛాయా.. శరీర సౌష్టవం .. చూడగానే ఏ కుర్రాడికైన "నాకు ఇలాంటి భార్య కావాలి" అని అనిపించేలా ఉంటుంది.. పుట్టింది మధ్య తరగతి కుటుంబం లో ఐన ఏ కష్టాలు లేని లేడి పిల్లలా కనిపిస్తుంది .. ఎప్పుడు తన ముఖం మీద చిరు నవ్వుని వీడనివ్వదు.. అమ్మకి ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ తన చదువు సాగిస్తూ ఉంది .. తను ఉన్న పరిస్థితులకి గవర్నమెంట్ కాలేజీ చదువు కి ఏదో అలా EAMCET లో ర్యాంక్ కొట్టేసింది .. అలా ఆ అమ్మాయి ఇంజనీరింగ్ లో జాయిన్ ఐంది .. అక్కడే వచ్చింది ఒక పెద్ద ట్విస్ట్ ..అదేంటో నెక్స్ట్ ఎపిసోడే లో చూడండి..

1 comment:

  1. Hmm Nice start.. will be waiting for next episode..

    My suggestion is: don't give a long break between episodes... should be max of 3-4 days anthe...

    ReplyDelete