Tuesday, July 21, 2015

బాహుబలి సినిమా రివ్యూ - The Epic

బాహుబలి సినిమా ట్రయలర్ చూసాక మూవీ ఎలా ఐనా చూడాల్సిందే అనిపించింది.. కాని ఈ మధ్య ఏదైనా సినిమా చూడాలంటే మొదట కొన్ని వెబ్ సైట్స్ లో రివ్యూ చూసి బాగుంది అంటే అప్పుడు వెళ్ళేదాన్ని.. కాక పొతే బాహుబలి సినిమా ట్రయలర్ చూసాక రివ్యూ  తో పని లేకుండానే చూడొచ్చు అనుకున్నాను.. కాని టికెట్ ధర చూసి భయం వేసి కొద్ది రోజులు ఆగి చూద్దాం లే అని వదిలేసా.. కనీసం కథ ఐన తెలుసుస్తుంది లే అని రివ్యూలు చూడసాగాను.. 


రివ్యూస్ చూసాక చాలా మంది నెగటివ్ గా రేటింగ్ ఇస్తున్నారని అనిపించిన్ది.. రాజమౌళి సినిమాలు దాదాపు 99% బాగుంటాయి.. ఐతే ఇంత హైప్ వచ్చిన ఈ మూవీ కి తక్కువ రేటింగ్ వస్తుందని మాత్రం నిజమైనది అని అనిపించలేదు.. 

తీరా సినిమా చూసాక ఆ వెబ్ సైట్స్ ఇచ్చిన రివ్యూ అండ్ రేటింగ్ రెండూ తప్పే.. హాలీవుడ్ మూవీస్ లో 300 సినిమా చూసినప్పుడు చాల చాలా బాగుంది అనిపించింది..  కాకపొతే ఇది కాస్త  గ్రాఫిక్స్ మీద ఆధార పడ్డ సినిమా..  కాని బాహుబలి సినిమా చూసాక గ్రాఫిక్స్ అన్న ఫీలింగ్ లేకుండా మొత్తం సహజ సిద్ధంగా తీసిన రిచ్ మూవీ..ఒక ప్రాంతానికో లేక ఒక భాష కో సంబందించినది గా కాకుండా అందరు చూసే విధంగా ఉంది.. 
               ఆ జలపాతాల సీన్స్, యుద్ధ భూమి సీన్స్ హీరో విలన్ పర్సనాలిటీస్ అమోఘం.. అనవసరమైన పాటలు పెట్టి సాగదీయకుండా కథ మీద టైం పెట్టి ప్రేక్షకుడిని రెప్పపాటు కూడా సీట్ నుండి కదలకుండా కట్టిపడేస్తుంది  సీన్.. తమన్నా తో పోలిస్తే అనుష్క కి కాస్త తక్కువ నిడివి ఇచ్చినా తరువాత భాగం లో ఈమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు.. ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చాల బాగా చూపించాడు.. పిల్లలు పెద్దలు అందరూ చూసే విధంగా తీసారు.. 
           ఒక హిట్ సినిమా తీయాలి అంటే మన దేశం వదిలి ఇంకో దేశం పోనవసరం లేదు సీనరీస్ కోసం. గ్రాఫిక్స్ ని నమ్ముకుని మాత్రమే డబ్బులు ఖర్చు చెయ్యక్కర్లేదు.. కథ గాలికి వదిలేసి అనవసరం ఐన వినసొంపు కాని పని కి మాలిన పాటలు పెట్టి 3 గంటలు పెట్టి సినిమా సాగదీయ్యక్కర్లేదు.. ఐటమ్ సాంగ్ తప్పక ఉండాలి అనే వెర్రితనం అక్కర్లేదు.. బయట చూస్తున్న హింసలు మళ్లి మళ్లీ చూపించి సినిమా చివరలో ఇది తప్పు ఇలా చెయ్యకూడదు అని హింస పెట్టక్కర్లేదు.. కామన్ గా వస్తున్న సినిమాలకు కాస్త భిన్నంగా తీస్తే సగటు ప్రేక్షకుడు వినోదాన్ని అస్వాదిస్తాడు.. 

               ఈ మద్య కాలం లో వచ్చిన సినిమాలు దాదాపు ప్రేమ దోమ కక్షలు టెర్రరిసమ్ లేకపోతె పరమ బూతులతో కూడిన కామెడీ.. లేదంటే హీరోయిన్ ఒళ్ళు చూపించి 3 గంటలు అక్కర్లేని 6 పాటల తో ప్రేక్షకుడి ప్రాణాలు తోడేస్తున్నారు.. అదీ చాలదు అన్నట్లు కాస్త డబ్బున్న బడా మనుషులు తమ పిల్లల్ని హీరో లు గా పెట్టి చూసే వాడె పోతాడు అన్నట్లుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ హీరోలు/ హీరోయిన్స్ ఎలా అంటే కనీసం మొహం లో ఫీలింగ్స్ కాని హావ భావాలు కాని ఉండవు.. పెర్సనాలిటీ కూడా లేకపోయినా పెద్ద పెద్ద మాస్ ఫైట్స్.. ఇంకా వాళ్లకు రాసే డైలాగ్స్ బాబోయ్ నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు.. ఎంత దారుణం అంటే లాస్ట్ కి ఫ్రీ గా కూడా యూట్యూబ్ లో 10 ని. ల పాటు కూడా చూడలేక ఏదైనా పాత సినిమా బాగున్నది మళ్లి మళ్లీ చూసుకోవాలనిపిస్తుంది.. ఇంకా టికెట్ కొని సినిమా హాల్ వరకు వెళ్లిన ప్రేక్షకుడు ఏమై పోతాడో.. 

బాహుబలి రెండవ భాగము కూడా బాగా తీయాలని ఇదే విధంగా ప్రేక్షకుడి ఆకట్టుకునేలా జోరు కొనసాగిస్తుందని ఆశిద్దాము.. 

No comments:

Post a Comment